అఖిల్ మ్యాటర్లో నాగార్జున కొత్త స్టెప్

March 7, 2017 at 5:37 am

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్‌కు కేరీర్ స్టార్టింగ్‌లోనే వ‌రుస క‌ష్టాలు వెన్నాడుతున్నాయి. తొలి సినిమా అఖిల్ డిజాస్ట‌ర్ అయ్యింది. రెండో సినిమా విష‌యంలో ఇంకా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. విక్ర‌మ్ కుమార్‌తో సినిమా ఉంటుంద‌ని అనుకున్నా అది ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. ఓ వైపు శ్రియా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక అటు అఖిల్ తండ్రి నాగ్‌కు సైతం ప‌రిస్థితి బాగోలేదు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఓం న‌మో వేంక‌టేశాయ డిజాస్ట‌ర్ అయ్యింది. ఇదిలా ఉంటే నాగ్ అఖిల్ కేరీర్ ప‌రంగా ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. తొలి సినిమా అఖిల్ విష‌యంలో నాగ్ ప‌ర్య‌వేక్ష‌ణ బాగా ఎక్కువైంద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్‌.

దీంతో ఇక అఖిల్ రెండో సినిమా విష‌యంలో నాగ్ అస్స‌లు జోక్యం చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. విక్ర‌మ్‌కుమార్‌కే అఖిల్ రెండో సినిమా పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించేశాడ‌ట‌. ముందు ఈ క‌థ‌లో కూడా నాగ్ వేలుపెట్టిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. విక్ర‌మ్ సైతం ఓ ద‌శ‌లో నాగ్‌ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో పాటు అఖిల్ వ‌రుస క‌ష్టాల్లో ఉండ‌డంతో నాగ్ చివ‌ర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఏదేమైనా అఖిల్ రెండో సినిమా విష‌యంలో నాగ్ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌కుమార్‌కు ఫుల్ ఫ్రీడ‌మ్ ఇచ్చేశాడు. మ‌రి విక్ర‌మ్ మీదే అఖిల్ రెండో సినిమా రిజ‌ల్ట్ బేస్ అయ్యి ఉంది.

అఖిల్ మ్యాటర్లో నాగార్జున కొత్త స్టెప్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share