అగ్ర నిర్మాత‌కు ప‌వ‌న్ వార్నింగ్‌

December 29, 2016 at 7:03 am
Pawan Kalyan

సౌత్ ఇండియాలో ఒక‌ప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన ఘ‌న‌త శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం.ర‌త్నంది. ఓ వెలుగు వెలిగిన ర‌త్నం త‌ర్వాత ప‌వ‌న్‌తో ఖుషీ సినిమా కూడా తీశాడు. త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన బంగారం సినిమా అనుకున్న స్థాయిలో ఆడ‌లేదు. త‌న సినిమాలు వ‌రుస‌గా ప్లాప్ అవ్వ‌డంతో డిఫెన్స్‌లోకి వెళ్లిపోయిన‌ ర‌త్నంను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పిలిచి మ‌రీ ఆయ‌న బ్యాన‌ర్‌లో వ‌రుస‌గా సినిమాలు చేశాడు. ర‌త్నం బ్యాన‌ర్‌లో అజిత్ చేసిన సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆయ‌న తిరిగి కోలుకుని …. ఇప్పుడు తిరుగులేని పొజిష‌న్‌లో ఉన్నాడు.

ఇదిలా ఉంటే ప‌వ‌న్ హీరోగా ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమా చేసే ప‌వ‌న్ ఆ వెంట‌నే ఏఎం.ర‌త్నం సినిమాకు క‌మిట్ అయ్యాడు. కోలీవుడ్‌లో జిల్లా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఆర్‌టీ.నీశన్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్ హీరోగా ర‌త్నం నిర్మించే సినిమా పూజా కార్య‌క్ర‌మాలు కూడా జ‌రిగిపోయాయి. అయితే ఈ సినిమా విష‌యంలో నిర్మాత ర‌త్నం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో ప‌వ‌న్‌కు కోపం తెప్పిస్తోంద‌ట‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేస్తోన్న కాట‌మ‌రాయుడు సినిమాయే మార్చి వ‌ర‌కు షూటింగ్ ఉంటుంది. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమా ఆ త‌ర్వాత కాని ర‌త్నం – నీశ‌న్ సినిమా ప‌ట్టాలెక్క‌దు.

ప‌వ‌న్ ప్ర‌స్తుతం పొలిటిక‌ల్‌గా కూడా చాలా బిజీగా ఉన్నాడు. అయితే ర‌త్నం అప్పుడే ప‌వ‌న్ హీరోగా తాను నిర్మించే సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ ద్వారా కొన్ని ట్యూన్స్ రెడీ చేయించి వాటిపై అభిప్రాయం చెప్పాల‌ని ప‌వ‌న్‌కు పంపించాడ‌ట‌. ఇంకా కాట‌మ‌రాయుడు షూటింగ్ ఫినిష్ కాలేదు. త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమా ఉంది….చాలా టైం ఉండ‌గానే అంత తొంద‌రెందుకు మీ సినిమా గురించి…మీకు ఇచ్చిన మాట ప్ర‌కారం సినిమా చేసి పెడ‌తానుగా అని కాస్త సీరియ‌స్ అయ్యాడ‌ట‌. అది అస‌లు సంగ‌తి.

 

అగ్ర నిర్మాత‌కు ప‌వ‌న్ వార్నింగ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share