అనసూయ వెయిటింగ్‌ అందుకేనట.

September 24, 2016 at 6:27 am
Anasuya

బుల్లితెరపై హాటెస్ట్‌ యాంకర్స్‌గా పేరు పొందిన రేష్మీ, అనసూయలు వెండితెర తెరంగేట్రం చేసి, పోటాపోటీగా ఇద్దరూ సినిమాలు చేశారు. కానీ అనసూయ మాత్రం వెండితెరపై చకచకా రెండు సినిమాలు చేసేసింది. వాటితో మంచి పేరు కూడా తెచ్చుకుంది. కానీ ఆ తర్వాతే ఆమె కెరీర్‌లో వేగం తగ్గింది. కానీ రేష్మీ జోరు మాత్రం తగ్గలేదు. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై కూడా దూసుకుపోతోంది. అందుకే వెండితెరపై రేష్మీలా ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ పాత్ర కోసం ఎదురు చూస్తోందట అనసూయ. కొంచెం లేట్‌ అయినా అలాంటి అవకాశం కొట్టి తీరతానంటోంది.అదే సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకా అని బుల్లితెరపై స్పీడ్‌ పెంచేసింది అనసూయ.

ఏమయ్యిందట? అని అందరూ అనుకుంటోంటే, ఏమీ అవలేదుగానీ, మంచి సినిమా కోసం వెయిట్‌ చేస్తుండడం వల్లే కాస్త కెరీర్‌ స్లో అయినట్లు కనిపిస్తోందని అనసూయ వివరించింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఆశించనట్లుగా ఆ మంచి తరుణం రానే వచ్చింది. ఓ బిగ్‌ ఆఫర్‌ అనసూయ చేతిలోకి వచ్చిందట. అనసూయ ఓకే చేస్తే ఆ ప్రాజెక్ట్‌ ఫైనల్‌ కానుందని సమాచారమ్‌. అందులో అనసూయది మెయిన్‌ రోల్‌. లేడీ ఓరియెంటెడ్‌ కథాంశంతో ఓ బిగ్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని రూపొందించనుందట. అనసూయకి ఈ ఆఫర్‌ బాగా నచ్చిందట. అదేంటో తెలియాలంటే కాస్త ఆగాలి, తప్పదు.

అనసూయ వెయిటింగ్‌ అందుకేనట.
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts