ఆడదానికి ఆడదే శత్రువు.. ఇది చదవండి మీకే అర్థమవుతుంది!

February 28, 2017 at 9:52 am
131

సాధార‌ణంగా మ‌నం అప్పుడప్పుడు వినేమాట‌.. ఆడ‌దానికి ఆడ‌దే శ‌త్రువు అని! దీనిలో నిజం ఎంతో మ‌న‌కు అంత‌గా తెలీదు. కానీ, ఇటీవ‌ల ముంబైలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న నిజంగా ఈ మాట నూటికి నూట‌యాభై పాళ్లు నిజ‌మ‌ని నిరూపిస్తోంది. త‌న‌తో స‌హ‌జీవ‌నం చేసిన ఓ మ‌హిళ‌ను మ‌రో మ‌హిళ డీప్‌గా వాడేసుకోవ‌డంతోపాటు సోష‌ల్ మీడియా ఆధారంగా ఆడేసుకుంది కూడా!! నిజంగా ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని అనిపించేంత‌గా జ‌రిగిన ఆ ఘ‌ట‌న ఎంటో తెలియాలంటే.. ఇది చ‌ద‌వాల్సిందే.

వాళ్లిద్ద‌రూ మ‌హిళ‌లు.. ఇద్ద‌రూ 40లు దాటిన వ‌య‌సులోనే ఉన్నారు. గ‌తంలో స్వ‌లింగ సంప‌ర్కులుగా స‌హ‌జీవ‌నం కూడా చేశారు. అయితే, అనూహ్య కార‌ణాల‌తో విడిపోయారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఆ త‌ర్వాత‌.. ఈ ఇద్ద‌రిలో ఒక‌రికి.. వెర్రి ఆలోచ‌న వ‌చ్చింది.  ఒక మహిళ మరొకరి నగ్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది. ఇది భారీ స్థాయిలో వైర‌ల్ అయింది. దీంతో  ఆ రెండో మహిళ పోలీసులకు కంప్ల‌యింట్ చేసింది. ఇక్క‌డ ఇంటో ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఇద్దరు మహిళలూ ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో పాథాలజీ విభాగంలో పని చేస్తున్నారు.

దాదాపు దశాబ్దం పాటు ఇద్దరి మధ్య  ఆ సంబంధం కూడా ఉండేది. ఇలాంటి కేసు తమ వద్ద నమోదు కావడం ఇదే మొదటిసారిన ముంబై పోలీసులు చెబుతున్నారు. ఇద్దరిలో ఒక మహిళకు ముందే పెళ్లయిందని, అయితే భర్తతో విడిపోయిన తర్వాత వీళ్లిద్దరూ దగ్గరయ్యారని చెప్పారు. ఆరు నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత.. గత రెండేళ్లుగా ఆమె ఫేస్‌బుక్ పేజీ ద్వారా తన నగ్న ఫొటోలను పంపుతున్నట్లు బాధితురాలు గుర్తించిన‌ట్టు వివ‌రించారు. చివరకు ఆమె వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్‌గా కూడా తన నగ్నఫొటోలే వాడుతున్నట్లు గుర్తించడంతో పోలీసులను ఆశ్రయించిన‌ట్టు చెప్పారు.  సో.. ఇద‌న్న‌మాట విష‌యం!

ఆడదానికి ఆడదే శత్రువు.. ఇది చదవండి మీకే అర్థమవుతుంది!
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share