ఆ అమ్మాయితో దేవిశ్రీ పెళ్లి ఫిక్స్‌

December 8, 2016 at 5:09 am
devisriprasad

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ కేరీర్ ప‌రంగా దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ వ‌ర‌కు చూసుకుంటే దేవి మ్యూజిక్ టాప్‌లో ఉంటుంది. ఇష్టం సినిమాతో కేరీర్ స్టార్ట్ చేసిన దేవి వ‌య‌స్సు ప్ర‌స్తుతం 35 సంవ‌త్స‌రాలు. త‌న‌తో పాటు కేరీర్ స్టార్ట్ చేసిన హీరోలు, సంగీత ద‌ర్శ‌కులు ఇప్ప‌టికే పెళ్లిళ్లు చేసుకుని పిల్ల‌ల‌తో ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా..దేవి మాత్రం ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు.

ఒక‌రిద్ద‌రు హీరోయిన్ల‌తో దేవి ఎఫైర్లు న‌డిపిన‌ట్టు కూడా వార్త‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎట్ట‌కేల‌కు దేవి పెళ్లికి ముహూర్తం ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల త‌న తండ్రి స‌త్య‌మూర్తి సంవత్స‌రీకం కోసం దేవి త‌న సొంత జిల్లా తూర్పుగోదావ‌రిలో ఉన్న స్వ‌గ్రామానికి వెళ్లాడ‌ట‌. అక్క‌డ దేవి బంధువులు తెలిసిన అమ్మాయిని చూపించి, పెళ్లి చేసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టార‌ట‌.

ఆ అమ్మాయి ఉన్న‌త కుటుంబానికి చెందిన అమ్మాయి కావ‌డంతో పాటు, బాగా చ‌దువుకుని ఉండ‌డంతో దేవి త‌ల్లి సైతం ఆ అమ్మాయిని చేసుకోవాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింద‌ట‌. దీంతో దేవి సైతం త‌న‌పై బంధువులు, త‌ల్లి ఒత్తిడి చేయ‌డంతో ఆ అమ్మాయిని చేసుకునేందుకు ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. దేవి చేసుకోబోయే అమ్మాయి కూడా తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన అమ్మాయేన‌ట‌. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌గా దేవి ఎట్ట‌కేల‌కు ఓ ఇంటి వాడు అవుతున్నాడ‌న్న‌మాట‌.

 

ఆ అమ్మాయితో దేవిశ్రీ పెళ్లి ఫిక్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share