ఆ తమిళ్ హిట్ సినిమా సీక్వల్ కి మహేష్

December 13, 2016 at 9:59 am
Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా దాదాపు రూ.90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు టాప్ మోస్ట్ టెక్నీషియ‌న్స్ ప‌ని చేస్తున్నారు.

మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ జె సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు. హ‌రీష్‌జైరాజ్ స్వ‌రాలందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించి మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఏజెంట్ శివ – అభిమ‌న్యుడు – సంభ‌వామి ఇలా ర‌క‌ర‌కాల టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి.

ఈ వార్త‌లు ఇలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. గతంలో విజయ్ హీరోగా నటించిన తుపాకీ సినిమాకు సీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. తుపాకీ సినిమాకు కంటిన్యూగా ఈ స్టోరీని ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ రాసిన‌ట్టు కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక టైటిల్ కూడా తుపాకీ 2 అని పెట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటున్నారు. మ‌రి ఈ రూమ‌ర్లు ఎంత వ‌ర‌కు నిజ‌మో చూడాలి. జ‌న‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

 

ఆ తమిళ్ హిట్ సినిమా సీక్వల్ కి మహేష్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share