ఆ ముగ్గురి చేతిలో అడ్డంగా బుక్ అయిన ఎన్టీఆర్

February 15, 2017 at 1:03 pm
jr_ntr_in_rabhasa_movie_first_look-wide

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న జ‌న‌తా గ్యారేజ్ హిట్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మించే ఈ సినిమాకు ప‌వ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకు జై-ల‌వ‌-కుశ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని..ఈ మూడు క్యారెక్ట‌ర్ల‌కు త‌గ్గ‌ట్టుగా ఎన్టీఆర్ ప‌క్క‌న ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తార‌ని కూడా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌క్క‌న న‌టించే హీరోయిన్ల మ్యాటర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేకపోవడం నందమూరి అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు.

సినిమా పూజకి రాశీ ఖన్నా మాత్రమే విచ్చేయడంతో మిగతా ఇద్దరు ఎవరన్న దానిపై క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో రాశికి తోడు ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసే మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ల ఎంపిక కూడా దాదాపు పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ టైగర్‌తో ఎన్నో చిత్రాల్లో కలసి నటించిన కాజల్‌ను ఓ క్యారెక్టర్‌కు ఎంపిక చేశారట.

ఇక మరో పాత్రకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఫైనలైజ్ చేశారట. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారట. మరి ఒకేసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్న యంగ్ టైగర్ ట్రిపుల్ రోల్‌లో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి. ఏదేమైనా ఎన్టీఆర్‌కు బాగా కలిసొచ్చిన కాజ‌ల్‌ను మ‌రోసారి ఈ సినిమాలో కూడా ఎంపిక చేయ‌డం విశేషం.

ఆ ముగ్గురి చేతిలో అడ్డంగా బుక్ అయిన ఎన్టీఆర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share