ఇండస్ట్రీని షేక్ చేస్తున్న DJ సాటిలైట్ రైట్స్

February 24, 2017 at 6:04 am
Allu arjun

గ‌తేడాది స‌రైనోడు అంటూ ఊర‌మాస్ హిట్ కొట్టిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ యేడాది దువ్వాడ జ‌గ‌న్నాథం అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు నిర్మాత‌గా హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్ మ‌హాశివ‌రాత్రి కానుకగా రిలీజ్ అయ్యి సూప‌ర్బ్ అన్న టాక్ తెచ్చుకుంది. శైవ బ్రాహ్మ‌ణుడిగా బ‌న్నీ గెట‌ప్‌తో పాటు మోడ్ర‌న్ అమ్మాయిగా పూజా రోల్ టీజ‌ర్‌కే హైలెట్‌గా నిలుస్తోంది.

ఈ టీజ‌ర్ రెస్సాన్స్ చూస్తుంటేనే సినిమాపై ఉన్న క్రేజ్ అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌, శాటిలైట్ రైట్స్ ఇండ‌స్ట్రీలో పెద్ద షాకింగ్‌గా మారాయి. డీజేకు రూ.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోన్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విష‌యంలో వ‌స్తోన్న వార్త‌లు ఇండ‌స్ట్రీలోనే షాకింగ్‌గా మారాయి.

డీజే శాటిలైట్ రైట్స్‌ను తీవ్ర‌పోటీ మ‌ధ్య‌ జీ తెలుగు ఛానల్ దక్కించేసుకుంది. ఇది ఇప్పటివరకూ బన్నీ సినిమాల్లోనే కాదు.. తెలుగు సినిమా శాటిలైట్ విషయంలోనే ఇది టాప్ రేటు అంటున్నారు. అయితే ఈ డీల్ మాత్రం సీక్రెట్‌గా ఉంచార‌ట‌. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. స‌మ్మ‌ర్ కానుక‌గా మే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

ఇండస్ట్రీని షేక్ చేస్తున్న DJ సాటిలైట్ రైట్స్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share