ఎన్టీఆర్ కొత్త సినిమా క‌థ ఇదే..!

December 8, 2016 at 12:01 pm
jrntr

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు స‌రైన క‌థ ప‌డితే ఎలాంటి హిట్ ప‌డుతుందో జ‌న‌తా గ్యారేజ్ చిత్రం నిరూపించింది. ఈ సినిమా హిట్ త‌ర్వాత ఎన్టీఆర్ క‌థ‌ల ఎంపిక‌లో  మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న బ‌ల‌మైన నిర్ణ‌యానికి వ‌చ్చేయ‌డంతో అత‌డికి ఓ ప‌ట్టాన ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌లేవీ న‌చ్చ‌డం లేదు. త‌న నెక్ట్స్ సినిమా కోసం ఇప్ప‌టికే ప‌లువురు డైరెక్ట‌ర్లు చెప్పిన క‌థ‌లు విన్న ఎన్టీఆర్ ఎట్ట‌కేల‌కు ప‌వ‌ర్‌-స‌ర్దార్ సినిమాల డైరెక్ట‌ర్ బాబి చెప్పిన క‌థ‌కు ఓటు వేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

డైరెక్టర్ బాబీ చెప్పిన కథ జూనియర్ కి నచ్చిందట‌..  ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో నటించే ఈ చిత్రానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింద‌ట‌.  ఈ నెల తొమ్మిదినే తార‌క్  కొత్త మూవీకి కొబ్బరికాయ కొట్టబోతున్నారని  తాజా స‌మాచారం. ఆ వెంటనే మూవీని సెట్స్ మీదికెక్కించే ప్ర‌య‌త్నాలు కూడా చురుగ్గా జ‌రుగుతున్నాయి. ఇక ఈ సినిమాను రూ.45 కోట్ల బ‌డ్జెట్‌లోపే తెర‌కెక్కించాల‌ని ఎన్టీఆర్‌-క‌ళ్యాణ్ డైరెక్ట‌ర్ బాబికీ కండీష‌న్స్ కూడా పెట్టార‌ట‌.

ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ఎన్టీఆర్ త‌న‌కు బాగా క‌లిసొచ్చిన కాజ‌ల్ అగ‌ర్వాల్ పేరును సూచించిన‌ట్టు కూడా రూమ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ సినిమా కోసం మిగిలిన టెక్నీషియన్స్ వివరాల‌ను కూడా షూటింగ్  ప్రారంభించిన‌ తర్వాత ప్రకటించ‌నున్నారు. ఏదేమైనా మూడు నెల‌ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ త‌మ హీరో కొత్త సినిమాను ప‌ట్టాలెక్కిస్తుండ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా పుల్ జోష్‌లో ఉన్నారు. అది ఎన్టీఆర్ – బాబి కొత్త సినిమా కొత్త అప్‌డేట్‌.

 

ఎన్టీఆర్ కొత్త సినిమా క‌థ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share