ఎన్టీఆర్ నో – బ‌న్నీ ఎస్‌

November 24, 2016 at 9:11 am

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ప్ర‌స్తుతం ఉన్న రికార్డులు, ఫామ్ అదిరిపోతోంది. బ‌న్నీ న‌టించిన చివ‌రి నాలుగు చిత్రాలు రూ.50 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ ఫాలో అవుతోన్న త‌న రూటును సైతం మార్చేశాడు. బ‌న్నీ ఓ సినిమా చేస్తుండ‌గా మ‌రో సినిమా గురించి ఆలోచించేవాడు కాదు. అయితే కొద్ది రోజులుగా బ‌న్నీ త‌న స్టైల్ మార్చేశాడు. ఓ సినిమా సెట్స్‌మీద ఉండ‌గానే మ‌రో సినిమాకు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నాడు.

ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో డీజే సినిమాలో న‌టిస్తోన్న బ‌న్నీ ఈ సినిమా సెట్స్‌మీద ఉండ‌గానే కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామి డైరెక్ష‌న్‌లో న‌టించే బైలింగ్వల్ ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. ఆ సినిమా ఇంకా ప్రారంభోత్సవం జరుపుకోకముందే బన్నీ మరో సినిమా కూడా ఓకే అయిపోయినట్లు సమాచారం.

అయితే ఈ సినిమా విష‌యంలో బ‌న్నీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన క‌థ‌ను ఓకే చేసిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ రైట‌ర్ వ‌క్కంతం వంశీ ఎన్నో హిట్ సినిమాల‌కు స్టోరీలు అందించాడు. బ‌న్నీ రేసుగుర్రం సినిమాకు సైతం వంశీయే స్టోరీ అందించాడు. ఇక వంశీ డైరెక్ట‌ర్‌గా డెబ్యూ మూవీ ఎన్టీఆర్‌తో ఉంటుంద‌ని రెండు సంవ‌త్స‌రాలుగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్ వంశీ స్టోరీని ప‌క్క‌న పెట్ట‌డంతో ఇప్పుడు అదే స్టోరీని బ‌న్నీ ఓకే చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాత ఎవరో కూడా తేలిపోయింది. లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. మరో విశేషం ఏంటంటే ఇందులో నాగబాబు నిర్మాణ భాగస్వామిగా ఉండబోతున్నాడట. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.

 

ఎన్టీఆర్ నో – బ‌న్నీ ఎస్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share