ఎన్టీఆర్ వ‌ర్సెస్ బ‌న్నీ విన్న‌ర్ ఎవ‌రు..!

December 16, 2016 at 5:28 am
NTR

సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మ హీరోల మీద అభిమానం పేరుతో జ‌రిగే ర‌చ్చ అంతా ఇంతా కాదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు నానా ర‌చ్చ ర‌చ్చ చేస్తారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మ‌ధ్య ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఇంట్ర‌స్టింగ్ వార్ జ‌రుగుతోంది.

2016 సంవత్సరానికి గూగుల్లో అత్యధికులు వెతికిన తెలుగు హీరో ఎవరు అనే ప్ర‌శ్న‌కు ముందుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్‌లో నిలిచాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా నంద‌మూరి అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వెంట‌నే అల్లు అర్జున్ అభిమానులు లైన్‌లోకి వ‌చ్చేశారు. ఎన్టీఆర్ కాదు బ‌న్నీనే మోస్ట్ వాంటెడ్ హీరో అంటూ నానా హంగామా చేశారు. దీంతో అస‌లు ఎవ‌రు మోస్ట్ సెర్చ్ హీరో అన్న ప్ర‌శ్న‌కు ఎవ్వ‌రికి క్లారిటీ లేదు.

అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. ఎన్టీఆర్ అనే నేమ్‌తో వెతికితే ఎన్టీఆర్ టాప్ ప్లేస్‌లో నిలిచాడ‌ట‌. బ‌న్నీ రెండో ప్లేస్‌లో ఉన్నాడ‌ట‌. ఈ జాబితాలో మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. ప్రభాస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అనే పద బంధంతో కలిపి వెతికినపుడు ఎన్టీఆర్‌కు నాలుగో ప్లేస్ రాగా అల్లు అర్జున్ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో మహేష్ బాబు రెండో స్థానంలో.. ప్రభాస్.. పవన్ కళ్యాణ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారని అంటున్నారు. ఐతే ఆయా హీరోల అభిమానులు ఎవ‌రికి వారు త‌మ హీరోనే నెంబ‌ర్ వ‌న్ అని మురుసుకుంటున్నారు.

 

ఎన్టీఆర్ వ‌ర్సెస్ బ‌న్నీ విన్న‌ర్ ఎవ‌రు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share