ఓవ‌ర్సీస్‌లో ఖైదీ ఖాతాలో రిలీజ్‌కు ముందే భారీ లాభాలు

December 29, 2016 at 6:11 am
chiru

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమాకు అన్ని ఏరియాల్లోను ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ము దులుపుతోంది. ఓవ‌రాల్‌గా ప్రి రిలీజ్ బిజినెస్ కం శాటిలైట్ ఆఫ‌ర్ క‌లుపుకుని ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల వ‌ర‌కు ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా ఇప్ప‌టికే రూ.10 కోట్ల‌కు అమ్ముడైన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఖైదీకి అమెరికాలో లోక‌ల్ బ‌య్య‌ర్ల నుంచి డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు వ‌స్తోన్న ఆఫ‌ర్లు సైతం దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి.ఓవ‌ర్సీస్ రైట్స్ ద్వారా నిర్మాత చెర్రీకి ఇప్ప‌టికే రూ.10 కోట్లు వ‌చ్చాయి. ఇక అక్క‌డ లోక‌ల్ ఏరియాల నుంచి చూస్తే టెక్సాస్ ఏరియా నుంచి 2 లక్షల డాలర్లు, బే ఏరియా నుంచి 1.7 లక్షల డాలర్లకు ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

ఓవ‌రాల్‌గా ఇదే రేంజ్‌లో అన్ని ఏరియాల‌కు బిజినెస్ జ‌రిగితే ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు రిలీజ్‌కు ముందే 20 నుంచి 30 శాతం వ‌ర‌కు లాభాలు వ‌స్తాయ‌ని ఓవ‌ర్సీస్ ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక చిరు ప‌దేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో పాటు ఇటీవల రిలీజ్ అయిన టీజ‌ర్లు, సాంగ్స్ సినిమాపై హైప్ మ‌రింత పెంచేస్తున్నాయి.

ఇప్పటివరకూ జరిగిన బిజినెస్ లెక్క ప్ర‌కారం చూస్తే ఖైదీకి ఓవ‌ర్సీస్‌లో 1.8 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు వ‌స్తేనే బ్రేక్ ఈవెన్ సాధ్య‌మ‌వుతుంది. ఈ సినిమాకు పోటీగా బాల‌య్య 100వ సినిమా, హిస్టారిక‌ల్ మూవీ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి కూడా ఉంది. ఆ పోటీని త‌ట్టుకుని చిరు అక్క‌డ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తాడో చూడాలి.

 

ఓవ‌ర్సీస్‌లో ఖైదీ ఖాతాలో రిలీజ్‌కు ముందే భారీ లాభాలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share