ఖైదీ నెంబ‌ర్ 150 టీజ‌ర్ టాక్‌.

December 9, 2016 at 5:34 am
Chiru

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల త‌ర్వాత చేస్తోన్న సినిమా కావ‌డంతో త‌న 150వ సినిమా అయిన ఖైదీ నెంబ‌ర్ 150 కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోను ఈ సినిమాతో హిట్ కొట్టాల‌ని క‌సితో ఉన్న చిరు క‌థ‌, డైరెక్ట‌ర్‌, హీరోయిన్ ఇలా ప్ర‌తి విష‌యంలోను ఆచితూచి అడుగులు వేస్తూ వ‌చ్చారు. ఖైదీ నెంబ‌ర్ 150 షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

ఇక తాజాగా రిలీజ్ అయిన టీజ‌ర్‌ను చూసిన వారు మాత్రం పెద‌వి విరుస్తున్నారు. ఈ సినిమా మీద ఎంత బ‌జ్ ఉందో ఈ సినిమాకు కేవ‌లం 3 గంటల్లో వ‌చ్చిన మిలియ‌న్ వ్యూస్ చెపుతున్నాయి. 45 సెకండ్ల టీజ‌ర్‌లో పాత చిరు క‌నిపించాడ‌న్న ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చిరు యాక్ష‌న్ , డైలాగ్ డెలివ‌రీలో పాత ప‌వ‌ర్ స్ప‌స్టంగా క‌నిపించింద‌న్న ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

చిరు వ‌ర‌కు టీజ‌ర్‌లో మంచి మార్కులే ప‌డుత‌న్నా వినాయ‌క్ మాత్రం రొటీన్‌కే రొటీన్‌గా మారిపోయాడ‌న్న కామెంట్లు ప‌డిపోతున్నాయి. వినాయ‌క్ మ‌రీ పాత ఆలోచ‌న‌ల‌తో బూజు ప‌ట్టిపోయి బ్యాక్ టు పెవిలియ‌న్ అన్న‌ట్టుగా మారిపోయాడ‌న్న టాక్ వ‌చ్చేసింది. ఇక పరుచూరి బ్ర‌ద‌ర్స్ కోస్తా అన్న డైలాగ్ మ‌రీ ఎట‌కారంగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

ఇక వినాయ‌క్ ఒక్క షాక్ కూడా ఇంప్రెసివ్‌గా లేదంటున్నారు. మురుగ‌దాస్ ఠాగూర్ సినిమాను ఎంతో చ‌క్క‌గా డీల్ చేసిన వినాయ‌క్ ఖైదీ విష‌యంలో మాత్రం త‌న ట్రీట్‌మెంట్ ట‌చ్ ఇవ్వ‌డంలో కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యాడ‌న్న టాక్ ఖైదీ టీజ‌ర్ విష‌యంలో వినిపిస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం పాత వాస‌న‌ల‌తోనే ఉంద‌న్న టాక్ వ‌స్తోంది. ఓవ‌రాల్‌గా ఖైదీ టీజ‌ర్ మాత్రం అంచ‌నాల‌తో పోల్చుకుంటే అంత‌గా ఎట్రాక్ట్ చేయ‌లేద‌న్న చ‌ర్చ ఇండ‌స్ట్రీలో ఎక్కువుగా న‌డుస్తోంది.

 

ఖైదీ నెంబ‌ర్ 150 టీజ‌ర్ టాక్‌.
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share