గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి బ‌డ్జెట్ లెక్క ఇదే

December 22, 2016 at 7:51 am
Balakrishna

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైల‌ర్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పుడే టాలీవుడ్ సినీజ‌నాలందరి క‌న్ను శాత‌క‌ర్ణి సినిమాపైనే ఉంది. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో బాల‌య్య క్యారెక్ట‌ర్‌ను క్రిష్ ఓ రేంజ్‌లో తీసిన‌ట్టు ట్రైల‌ర్‌లోనే తెలిసిపోయింది.

17వ శ‌తాబ్దం నాటి క‌థ‌ను విజువ‌లైజ్ చేయ‌డంలో క్రిష్ టాలెంట్‌ను అంద‌రూ మెచ్చుకోలేకుండా ఉండ‌లేక‌పోతున్నారు. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే నిలిచిపోయే సినిమాగా అంద‌రూ భావిస్తోన్న ఈ సినిమాకు క్రిష్ ఎంత బ‌డ్జెట్ పెట్టాడో తెలిస్తే షాక్ అవ్వ‌క త‌ప్ప‌దు.

ఇంత గ్రాండ్‌నెస్‌గా శాత‌క‌ర్ణి సినిమాను తెర‌కెక్కించిన క్రిష్‌…ఇందుకోసం కేవ‌లం 8 నెల‌ల టైం తీసుకున్నాడు. ఇక రూ.55 కోట్ల బ‌డ్జెట్ మాత్ర‌మే పెట్టాడు. అంత తక్కువ బ‌డ్జెట్‌తో ఇంత క్వాలిటీగా ఈ సినిమాను క్రిష్ తెర‌కెక్కించిన తీరుకు అంద‌రూ ఫిదా అవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య కేరీర్‌లోనే వ‌సూళ్ల ప‌రంగా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన లెజెండ్ రూ.44 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక క్రిష్ తీసినిమాల్లో అత్యధికంగా వసూలైనది 30 కోట్లు మాత్రమే.

ఈ లెక్క‌న చూస్తే అటు క్రిష్‌కు, ఇటు బాల‌య్య‌కు ఎవ్వ‌రికి రూ.50 కోట్ల సినిమా లేదు. కానీ క‌థ‌ను న‌మ్మి సాహ‌సంతో వీరిద్ద‌రు ఈ సినిమాకు అంత బ‌డ్జెట్ పెట్టారు. సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమాకు అంచ‌నాల‌కు మించి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మ‌రి సినిమా రిలీజ్‌కు ముందే ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన శాత‌క‌ర్ణి రిలీజ్ అయ్యాక ఇంకెన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి బ‌డ్జెట్ లెక్క ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share