గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో వెంక‌టేష్‌

December 27, 2016 at 5:57 am
ntr-venkatesh

నందమూరి నటసింహం బాలకృష్ణ త‌న కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 100వ సినిమాలో గౌతమిపుత్ర శాతకర్ణిగా కనిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే వాస్త‌వానికి ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి జీవిత చ‌రిత్ర ఆధారంగా బాల‌య్య తండ్రి, న‌ట‌రత్న ఎన్టీఆరే స్వ‌యంగా ఈ సినిమా చేయాల‌నుకున్నాడ‌ట‌.

శాత‌క‌ర్ణిగా ఎన్టీఆర్‌, శాత‌క‌ర్ణి త‌న‌యుడిగా పులోమావీ రోల్‌లో విక్ట‌రీ వెంక‌టేష్‌ను తీసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. ఇందుకోసం ఆయ‌న నాటి ప్రముఖ జర్నలిస్టు ప్రదీప్, నాటి యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రసాద్ చేత 110 సీన్ల‌తో స్క్రిఫ్ట్ కూడా రెడీ చేయించిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని బాల‌య్యే స్వ‌యంగా వెల్ల‌డించారు.

ఆ స్క్రిప్టులో గౌతమిపుత్ర శాతకర్ణి పుత్రుడు పులోమావి పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగానే ఉంద‌ట‌. ఓ సారి వెంక‌టేష్ ఎన్టీఆర్‌ను క‌లిసి మీతో న‌టించాల‌ని ఉంద‌ని చెప్పిన‌ట్టు బాల‌య్య తెలిపారు. అప్పుడు వెంక‌టేష్ కోస‌మే ఎన్టీఆర్ పులోమావి పాత్ర‌ను డిజైన్ చేయించిన‌ట్టు బాల‌య్య అన్నారు.

పులోమావీ గెటప్‌లో వెంకటేశ్ ఎలా ఉంటాడో స్కెచ్‌లు గీయించారని…. నాడే ఎన్టీఆర్‌ స్క్రిప్టుతో పాటు ఆ సినిమాకు అవసరమైన ఆభరణాలు, ఆయుధాల డిజైన్లను కూడా గీయించారన్న విష‌యాన్ని బాల‌య్య వెల్ల‌డించారు. శ్రీనాథ క‌విసౌర్వ‌భౌమ తర్వాత ఈ సినిమా చేయాల‌నుకున్న ఎన్టీఆర్ ఆ సినిమా చేయ‌కుండానే మృతిచెందారు. అలా ఆనాడే శాత‌క‌ర్ణి తెర‌కెక్కి ఉంటే అందులో పులోమావిగా వెంక‌టేష్ న‌టించి ఉండేవాడు.

 

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో వెంక‌టేష్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share