చిరు డైరెక్ష‌న్ – వినాయ‌క్ యాక్ష‌న్‌

December 14, 2016 at 9:37 am
chiranjeevi

ఈ హెడ్డింగ్ చూసి ఒక్క‌సారిగా షాక్ అవుతాం. చిరు 150వ సినిమా ఖైదీ నెం 150 క్రేజీ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోందిగా…మ‌రి చిరు డైరెక్ష‌న్‌లో వినాయ‌క్ న‌టించ‌డం ఏంట‌ని మ‌నం కాస్త షాక్ అవుతాం. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే చిరు కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెం 150 షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం ప్యాచ్ వ‌ర్క్ సాగుతోంది. ఇందులో వినాయ‌క్ ఓ చిన్న పాత్ర‌లో త‌ళుక్కున క‌నిపించ‌బోతున్నాడు.

ఈ సీన్ కోసం వినాయ‌క్ కెమేరా ముందుకు వ‌స్తే…కెమేరా ముందు ఉండాల్సిన చిరు కాసేపు కెప్టెన్ కుర్చీలో కూర్చుని యాక్ష‌న్ క‌ట్ చెప్పారు. అలా వినాయ‌క్ సీన్ కోసం చిరు ద‌ర్శ‌కుడు అయ్యాడు. చిరు డైరెక్ష‌న్‌లో న‌టించ‌డం చాలా కొత్త‌గా థ్రిల్లింగ్‌గా ఉంద‌ని వినాయ‌క్ ఫుల్ ఖుషీ ఫీల‌వుతున్నాడ‌ట‌.

చిరు – వినాయ‌క్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఠాగూర్‌లో కూడా వినాయ‌క్ ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ఖైదీ సినిమా కోసం రిపీట్ చేశార‌న్న‌మాట‌. ఖైదీ నెం 150లో ఆల్రెడీ ఓ పాట‌లో చిరుతో క‌ల‌సి చ‌ర‌ణ్ స్టెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి సినిమా రిలీజ్ టైంకు ఖైదీ నెం 150కు ఇంకెన్ని ప్ర‌త్యేక‌త‌లు క‌లుస్తాయో చూడాలి. ఇక ఈ సినిమా ఆడియో ఈ నెల 25న విజ‌య‌వాడ‌లో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

 

చిరు డైరెక్ష‌న్ – వినాయ‌క్ యాక్ష‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share