చిరు – రాంచ‌ర‌ణ్ సినిమా టైటిల్ ఇదే..!

December 2, 2016 at 9:09 am
chiru and ramchran

మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ తేజ్ సినిమా అన‌గానే మెగా ఫ్యామిలీతో పాటు సినిమా వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు ఉంటాయి. ఈ తండ్రికొడుకులిద్ద‌రు ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి కంప్లీట్ సినిమా చేయ‌క‌పోయినా త‌న‌యుడు చెర్రీ న‌టించిన రెండు సినిమాల్లో మాత్రం చిరు గెస్ట్ రోల్ చేశాడు.

చెర్రీ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన మ‌గ‌ధీర సినిమాలో చిరు ఓ సాంగ్‌లో చెర్రీతో క‌లిసి చిందేశాడు. ఇక చెర్రీ చివ‌రి చిత్రం బ్రూస్‌లీ సినిమాలో సైతం చిరు చిన్న రోల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తండ్రి త‌న‌కు చేసిన సాయానికి బ‌దులుగా ఇప్పుడు చెర్రీ త‌న తండ్రి సినిమాలో గెస్ట్ రోల్ చేయ‌నున్నాడ‌ట‌.

మెగాస్టార్ కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 150వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్ప‌టికే ఫ్యాన్స్‌లో ఉన్న భారీ అంచ‌నాలు మ‌రింత పెంచేస్తూ మ‌రో స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చేందుకు చెర్రీ రెడీ అవుతున్నాడు.

సినిమాలో రాయ్ ల‌క్ష్మితో క‌లిసి చిరు చిందేసే ఐటెం సాంగ్‌లో చెర్రీ సైతం కాలు క‌దిపి తండ్రితో స్టెప్పులు వేస్తాడ‌ట‌. కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి సినిమాకు రీమేక్ వ‌స్తోన్న ఈ సినిమాలో చిరు స‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌ర్చిన ఆడియో ఈ నెల‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

చిరు – రాంచ‌ర‌ణ్ సినిమా టైటిల్ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share