” జై ల‌వ కుశ‌ ” లో ఎన్టీఆర్ మూడు రోల్స్ చూస్తే షాకే

February 23, 2017 at 10:48 am
NTR

యంగ్ టైగ‌ర్ అభిమానులు ఖుషీ అయ్యే న్యూస్‌! ఇప్పటికే హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రంపై ఫోక‌స్ పెట్టాడు. వైవిధ్యమైన కథాంశాల‌కు తార‌క్ ఓటేస్తున్నాడు. ఇది వ‌ర‌కు ద్విపాత్రాభిన‌యం చేసి అల‌రించిన తార‌క్‌.. ఈ సినిమాలో మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే! మ‌రి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌టికొచ్చింది. అదేంటంటే.. ఇందులో ఒక‌టి తండ్రి పాత్ర కాగా.. మ‌రో రెండు పాత్ర‌ల్లో క‌వ‌ల‌లుగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.

జ‌న‌తాగ్యారేజ్‌ సినిమా ద్వారా స‌రికొత్త రికార్డుల క్రియేట్ చేసి బాక్సాఫీస్ ముందు త‌న స‌త్తా మ‌రోసారి చాటాడు ఎన్టీఆర్‌! ఈ సినిమా త‌ర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తారక్ నెక్ట్స్ మూవీ ప్రారంభమైపోయింది. ప్రస్తుతం షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొనకపోతున్నా.. ఇతర ఆర్టిస్టులపై చిత్రీకరణ చేస్తున్నారు.

ఈ సినిమాకు సబంధించిన మరో ఆసక్తికర విషయమేంటంటే.. తమిళంలో అజిత్ నటించిన ‘వరలారు’ అనే సినిమా కథను పోలి ఉంటుందని చెబుతున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజిత్ మూడు పాత్రల్లో కనిపించాడు. 2006లో వచ్చిన ఈ సినిమా.. వాణిజ్య పరంగానే కాకుండా అజిత్‌కు కూడా మంచి పేరునే తెచ్చి పెట్టింది.

ఆ కథను పోలి ఉన్న కథనే బాబి.. ఎన్టీఆర్‌కు వినిపించాడని చెబుతున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. వాస్తవానికి ఇంతకుముందు ఆంధ్రావాలా సినిమాలో డబుల్ రోల్‌లో తండ్రీ..కొడుకులుగా, అదుర్స్‌లో కవలలుగా ఎన్టీఆర్ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు యావ‌రేజ్‌గా ఆడాయి. ఎన్టీఆర్‌కు అంత‌గా క‌లిసి రాలేదు. మ‌రి ఈ సెంటిమెంట్ ఎన్టీఆర్‌కు ఇప్పుడు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలి.

 

” జై ల‌వ కుశ‌ ” లో ఎన్టీఆర్ మూడు రోల్స్ చూస్తే షాకే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share