టాప్ డైరెక్ట‌ర్ డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్ – బాబి సినిమా

December 9, 2016 at 6:17 am
NTR

జనతా గ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్ తన తరువాతి ప్రాజెక్టుపై ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు ఆరేడుగురు డైరెక్ట‌ర్లు చెప్పిన క‌థ‌లు విన్న ఎన్టీఆర్ ఎట్ట‌కేల‌కు ప‌వ‌ర్ – స‌ర్దార్ డైరెక్ట‌ర్ బాబి చెప్పిన క‌థ‌ను ఓకే చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌కు స‌ర్దార్ లాంటి డిజాస్ట‌ర్ సినిమా ఇచ్చిన డైరెక్ట‌ర్‌కు ఎన్టీఆర్ ఓటేయ‌డం అంద‌రికి షాక్ కూడా ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు మామూలుగా ఓకే చెప్ప‌లేద‌ట‌. బాబి క‌థ‌ను మ‌రో టాప్ డైరెక్ట‌ర్‌కు కూడా వినిపించి, ఆ డైరెక్ట‌ర్‌తో మార్పులు – చేర్పులు కూడా చేయించుకున్నాడ‌ట‌. బాబి క‌థ‌నే విని మార్పులు చేసిన టాప్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు….ఎన్టీఆర్‌కు రీసెంట్‌గా జ‌న‌తా గ్యారేజ్ లాంటి టాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన కొర‌టాల శివ‌.

మొదట బాబీ కథ విన్న జూనియర్ కథలోని కొన్ని విషయాలపట్ల తనకు అనుమానం ఉండడంతో.. కథను కొరటాలకు వినిపించాడట. కొరటాలకు కథ నచ్చినా, చిన్న చిన్న సందేహాలు ఉండ‌డంతో వాటిని క్లారిపై చేసేందుకు క‌థ‌లో చిన్న చిన్న మార్పులు సూచించాడ‌ట‌.

ఇక త‌న‌తో పాటు క‌ళ్యాణ్‌రామ్‌, కొర‌టాల‌కు సైతం ఈ స్టోరీ న‌చ్చ‌డంతో ఎన్టీఆర్ కూడా ధైర్యంగా ఈ ప్రాజెక్టులో న‌టించాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మించ‌నున్నాడు. ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ పేరు హీరోయిన్‌గా వినిపిస్తోంది.

 

టాప్ డైరెక్ట‌ర్ డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్ – బాబి సినిమా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share