నానిని చూసి కుళ్లుకుంటోన్న టాలీవుడ్ హీరోలు ఎవరు..!

February 16, 2017 at 7:27 am
nani

టాలీవుడ్లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఓ హీరో ఒక హిట్ కొట్ట‌డం గొప్ప విష‌యం. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్‌లో కథల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి సినిమా ఫలితం హీరోల కెరీర్‌పై ప్రభావం చూపుతోంది. దీనివల్ల సినిమా సినిమాకు మధ్య హీరోల పొజీషన్‌ మారుతోంది. ఒక హీరో ఒక్క హిట్ కొట్ట‌డ‌మే గ‌గ‌నంగా ఉన్న నేప‌థ్యంలో వ‌రుస‌గా ఆరు హిట్లు కొట్ట‌డం అంటే మాట‌లు కాదు. కానీ నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస‌గా ఆరు హిట్లు కొట్టాడు.

ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం – భలే భలే మగాడివోయ్ – కృష్ణగాడి వీర ప్రేమగాథ – జెంటిల్‌మ‌న్ – మజ్ను – నేను లోకల్‌. వరుసగా ఆరు సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్కో సినిమాకు రెండున్నర నుండి మూడు కోట్లు పారితోషికం తీసుకుంటున్న నాని కథల ఎంపికలో వైవిథ్యాన్ని చూపడం వల్లే సక్సెస్‌లు సాధిస్తున్నాడు. నాని వ‌రుస హిట్లే ఇప్పుడు మిగిలిన స్టార్ హీరోలంద‌రూ అత‌డి ప‌ట్ల ఈర్ష్య‌తో ఉండేలా చేస్తున్నాయ‌ట‌.

నాని వ‌రుస విజ‌యాలు చూసి టాలీవుడ్ వార‌స‌త్వ హీరోలు దిమ్మ‌తిరిగే షాక్‌లో ఉన్నార‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో వార‌సుల‌కు చాలా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. వారికి ఫైనాన్షియ‌ల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఫ్యాన్స్ వ‌ర‌కు ఎంతో మంది ఉన్నారు. కానీ అవేమి లేకుండానే నాని వ‌రుస హిట్లు కొట్ట‌డం వారు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌.

టాలీవుడ్‌లో వార‌సుల విష‌యానికి వ‌స్తే నాగచైతన్య, అఖిల్‌, నితిన్‌, విష్ణు, మనోజ్‌, అల్లు శిరీష్‌, వరుణ్‌ తేజ్‌, రామ్‌ చరణ్‌ వంటి సినీ వారసులు హీరోలుగా నిలదొక్కుకోవడానికి అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. అనేక మంది యువ హీరోలకు నాని పెద్ద సవాల్‌ విసిరినట్టుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. నాని ఇక‌పై త‌న కేరీర్‌ను మ‌రింత జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటే పెద్ద స్టార్ అయిపోతాడ‌న‌డంలో సందేహం లేదు.

నానిని చూసి కుళ్లుకుంటోన్న టాలీవుడ్ హీరోలు ఎవరు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share