నాని ల‌వ‌ర్ ప‌వ‌న్‌కు మ‌ర‌ద‌లా..!

December 2, 2016 at 7:20 am
pavankalyan

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ప‌ట్టాలెక్కే సినిమా ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకుంది. వీరిద్ద‌రి కాంబోలో ఇప్ప‌టికే జ‌ల్సా – అత్తారింటికి దారేది సినిమాలు వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే మూడోసారి వీరి కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే సినీ అభిమానుల్లో భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.

ఈ సినిమా కూడా అత్తారింటికి దారేది సినిమా లాగానే ఫ్యామిలీ అండ్ కామెడీ ట‌చ్‌తో ఉంటుంద‌ని స‌మాచారం. అత్తారింటికి దారేది సినిమాలో ప‌వ‌న్ ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు రొమాన్స్ చేశారు. ఆ సినిమాలో స‌మంత మెయిన్ హీరోయిన్ కాగా బాపు బొమ్మ ప్ర‌ణీత‌, ప‌వ‌న్‌కు మ‌ర‌ద‌లిగా న‌టించింది. ఆన్‌స్క్రీన్ మీద ప‌వ‌న్‌-ప్ర‌ణీత రొమాన్స్ అదిరిపోయింది.

ఇక ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ తాజా సినిమాలో సైతం ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటారు. మెయిన్ హీరోయిన్‌గా నేను..శైల‌జ ఫేం కీర్తి సురేష్‌ను తీసుకున్నారు. ప‌వ‌న్‌కు మ‌ర‌ద‌లి రోల్ ఛాన్స్ అను ఇమ్మానుయేల్ కి ద‌క్కింది. నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన మజ్నులో అను ఓ హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

గోపీచంద్ లేటెస్ట్ మూవీ ఆక్సిజ‌న్ సినిమాలోనూ అనూ సెకండ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్పుడు ప‌వ‌న్ తో న‌టించే బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే త్రివిక్ర‌మ్ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌నుంది. కోలీవ‌డ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుథ్ ర‌విచంద్ర‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 

నాని ల‌వ‌ర్ ప‌వ‌న్‌కు మ‌ర‌ద‌లా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share