నారాయణమూర్తి రెమ్యునరేషన్ అంతా..!

January 21, 2017 at 10:52 am
1265

విప్ల‌వ చిత్రాల ద‌ర్శ‌క‌నిర్మాత‌గా పేరున్న ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి త‌న సినిమాల‌న్ని త‌న సొంత బ్యాన‌ర్‌లోనే త‌ప్ప బ‌య‌ట బ్యాన‌ర్లో చేయ‌డు. త‌న సినిమాల‌న్నింటికి తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, అన్ని ప‌నులు తానే ద‌గ్గ‌ర నుంచి చేసుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. పూరి జ‌గ‌న్నాథ్ అంత‌టి స్టార్ డైరెక్ట‌రే టెంప‌ర్ సినిమాలో కీల‌క‌మైన రోల్ ఆఫ‌ర్ చేస్తే సారీ బ్ర‌ద‌ర్ అని చెప్పాడు.

అలాంటి ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి చాలా రోజుల త‌ర్వాత బ‌య‌టి బ్యాన‌ర్‌లో ‘హెడ్ కానిస్టేబుల్ వెంట‌ట్రామ‌య్య‌’ సినిమ‌మాలో న‌టించాడు. ఈ సినిమాకి చ‌ద‌ల‌వాడ ద‌ర్శ‌క‌నిర్మాత‌. ఇక ఈ సినిమాలో న‌టించినందుకు గాను నారాయ‌ణ‌మూర్తికి అక్ష‌రాలా రూ 1.5 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

కోటిన్న‌ర అంటే టాలీవుడ్ యంగ్‌హీరోలు రాజ్‌త‌రుణ్ – శ‌ర్వానంద్ వాళ్ల రేంజ్‌. నారాయ‌ణ మూర్తి సినిమాల బ‌డ్జెట్ కేవ‌లం కోటి రూపాయ‌ల‌లోపే ఉంటుంది. అయితే ఈ సినిమా కోసం ఆయ‌న‌కే రూ 1.5 కోట్లు ఇచ్చార‌ట‌. నారాయ‌ణ‌మూర్తి త‌న‌కు ఇంత కావాల‌ని అడ‌గ‌లేద‌ట‌. చ‌ద‌ల‌వాడే కోటిన్న‌ర చేతిలో పెట్టేశార‌ట‌.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా వ‌చ్చిన వ‌సూళ్లు మాత్రం చూస్తే షాక్ తిన‌క‌త‌ప్ప‌దు. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 14న రిలీజ్ అయిన ఈ సినిమాకు కోటి రూపాయ‌లు కూడా రాలేద‌ట‌. థియేట‌ర్లు దొర‌క‌లేద‌ని చెపుతున్నా…చాలా చోట్ల థియేట‌ర్ల అద్దె కూడా రాలేదేని స‌మాచారం. చ‌ద‌ల‌వాడ‌కు బిచ్చ‌గాడితో వ‌చ్చిన లాభాల్లో కొంత ఈ సినిమాకు వ‌దిలించ‌క త‌ప్పేలా లేదు.

నారాయణమూర్తి రెమ్యునరేషన్ అంతా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share