నారా రోహిత్ సినిమాలో ఊహించని కొత్త ట్విస్ట్

December 29, 2016 at 12:30 pm
Rohit

నారా హీరో నారా రోహిత్ వ‌రుస‌పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ యేడాది ఇప్ప‌టికే శంక‌ర – సావిత్రి – రాజా చెయ్యి వేస్తే – జ్యో అచ్యుతానంద – శంక‌ర సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రోహిత్ ఈ యేడాది చివ‌రిగా రేపు మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. నారా రోహిత్ లేటెస్ట్ మూవీ ” అప్పట్లో ఒకడుండేవాడు ” .. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తోంది.

పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్ తోపాటు శ్రీవిష్ణు కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్ద‌రి మ‌ధ్య అదిరిపోయే రేంజ్‌లో సీన్లు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇక ” అప్పట్లో ఒకడుండేవాడు ” సినిమాపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ న‌డుస్తోంది. ఈ సినిమా స్టోరీ ఓ మాజీ సీఎం చ‌రిత్ర ఆధారంగా ఉంటుంద‌ట‌.

ఆ మాజీ సీఎం ఎవ‌రో కాదు…రోహిత్ సొంత జిల్లాకే చెందిన మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి. నారా రోహిత్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా.. శ్రీ విష్ణు రైల్వే రాజు పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు పాత్రలు గ్యాంగ్ స్టర్ నయీం.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలను బేస్ చేసుకుని రాసుకున్న‌వే అన్న టాక్ వినిపిస్తోంది.

గతంలో అయ్యారే అనే చిత్రాన్ని తీసిన సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అది కూడా స్వామి నిత్యానంద పాత్ర చుట్టూ ఉన్న వివాదాల చుట్టూ రాసుకున్న మూవీనే. మ‌రి ఈ సినిమా రాజ‌కీయంగా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో రేప‌టి వ‌ర‌కు వెయిట్ చేస్తే గాని తెలియ‌దు.

 

నారా రోహిత్ సినిమాలో ఊహించని కొత్త ట్విస్ట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share