పవన్ కే షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్

February 2, 2017 at 5:44 am
Gabbar-Singh-Pawan-Kalyan-HD-Wallpapers

స్టార్ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ వ‌స్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అలాంటిది ఏకంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో ఛాన్స్ అంటే ఆ హీరోయిన్ ఆనందం మామూలుగా ఉండ‌దు. అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ప‌వ‌న్ ప‌క్క‌న ఆన్‌స్క్రీన్ రొమాన్స్ ఛాన్స్‌ను వ‌దులుకుంది. టాలీవుడ్‌లో ఇప్పుడు ల‌క్కీ గ‌ర్ల్ ఎవ‌రంటే ర‌కుల్‌ప్రీత్‌సింగ్ పేరే వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం స్టార్ హీరోలంద‌రితోను న‌టించి వ‌రుస హిట్లు కొడుతోన్న ర‌కుల్ ఇప్పుడు వ‌రుస‌గా మ‌హేష్‌బాబు ప‌క్క‌న మురుగ‌దాస్ సినిమాలో, సాయిధ‌ర‌మ్ తేజ్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, నాగ‌చైత‌న్య ప‌క్క‌న న‌టిస్తోంది. ర‌కుల్‌కు తాజాగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఆర్‌టి.నీశ‌న్ తెర‌కెక్కించే సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ వ‌చ్చింద‌ట‌. అయితే ఇప్ప‌టికే ఊపిరి స‌ల‌ప‌ని ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న ర‌కుల్ ప‌వ‌న్ ప‌క్క‌న న‌టించే ఛాన్స్‌ను వ‌దుల‌కుంద‌ట‌.

వ‌రుస సినిమాల‌తో 2017 డైరీ ఖాళీ లేద‌ని..అందువ‌ల్ల తాను ప‌వ‌న్ సినిమాకు డేట్లు ఇవ్వ‌లేన‌ని ఆమె తేల్చి చెప్పిందట. అదే కారణం కాకపోతే.. ఏ హీరోయినైనా పవన్ పక్కన ఛాన్స్ అంటే వదిలేసుకుంటారా? చెప్పండి. ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాతో పాటు నీశ‌న్ సినిమాలో ఒకేసారి న‌టిస్తాడు.

పవన్ కే షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share