ప‌వ‌న్‌ను క‌ల‌వ‌డ‌మే క‌ష్ట‌మా..!

February 24, 2017 at 4:56 am
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అంద‌రికి ముందుగా గుర్తొచ్చేది ఒక్క‌టే. ఎవ‌రైనా క‌ష్టాల్లో ఉంటే ప‌వ‌న్ ఇట్టే క‌రిగిపోతాడు…వారిని త‌న వంతుగా ఆదుకుంటాడు అన్న పేరుంది. అలాంటి పేరున్న ప‌వ‌న్ మీద ఇప్పుడు త‌న సినిమా కొన్న డిస్ట్రిబ్యూట‌ర్ ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని వాపోతున్నాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చివ‌రి చిత్రం స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌త స‌మ్మ‌ర్‌కు రిలీజ్ అయ్యి డిజాస్ట‌ర్ అయ్యింది.

ప‌వ‌న్ మీద ఉన్న న‌మ్మ‌కంతో అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూట‌ర్లు కోట్లు కుమ్మ‌రించి స‌ర్దార్ రైట్స్ తీసుకున్నారు. తీరా సినిమా ప్లాప్ అవ్వ‌డంతో వారంతా భారీగా న‌ష్ట‌పోయారు. అప్ప‌ట్లో స‌ర్దార్ డిస్డ్రిబ్యూట‌ర్లు త‌మ‌కు జ‌రిగిన భారీ న‌ష్టంపై ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌గా…ఈ న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసేందుకే ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు సినిమా చేస్తున్నార‌ని..ఆ సినిమా రైట్స్ మొత్తం స‌ర్దార్ బాధితుల‌కే ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు స‌ర్దార్ బాధితుల‌కు కాట‌మ‌రాయుడు రైట్స్ ఇవ్వ‌లేదు స‌రిక‌దా…ఇదేం అని ప్ర‌శ్నిస్తుంటే కాట‌మ‌రాయుడు నిర్మాత‌, ప‌వ‌న్ స‌న్నిహితుడు శ‌ర‌త్‌మ‌రార్ బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని డిస్డ్రిబ్యూట‌ర్లు వాపోతున్నారు. ఇదే అంశంపై కృష్ణా జిల్లా స‌ర్దార్ డిస్డ్రిబ్యూట‌ర్ సంప‌త్ మాట్లాడుతూ స‌ర్దార్ వ‌ల్ల తాను రూ.2 కోట్లు న‌ష్ట‌పోయాన‌ని…ప‌వ‌న్ చుట్టూ ఓ మాఫియా చేరి ప‌వ‌న్‌ను క‌లిసేందుకే అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని ఫైర్ అయ్యారు.

ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారాయి. కొంత కాలంగా పవన్‌ను కలవడం చాలా కష్టమైపోతుందనే మాట వాస్తవమే అంటున్నారు సినీ జనాలు. అసలు మెగా ఫ్యామిలీ వాళ్లకే పవన్ తో మాట్లాడటం కష్టమైపోతంద‌న్న టాక్ కూడా ఉంది. ప‌వ‌న్ ప‌ర్స‌న‌ల్ ఫోన్ నెంబ‌ర్ కూడా ఇండ‌స్ట్రీలో చాలా మంది పెద్ద‌ల‌కు తెలియ‌ద‌ట‌. ఏదైనా స‌మ‌స్య ఉంటే ప‌వ‌న్ చుట్టూ ఉండేవాళ్ల‌కే లేదా శ‌ర‌త్‌మ‌రార్‌కో ఫోన్ చేయాలి..వాళ్లు ప‌వ‌న్‌కు చెపుతారు. దీంతో ఏదైనా స‌మ‌స్య‌పై ప‌వ‌న్‌ను క‌ల‌వ‌డం చాలా క‌ష్ట‌మైపోతోంది.

ప్రజా జీవితంలోకి వచ్చి పార్టీ కూడా పెట్టిన పవన్ ఇలా సామాన్యులకు దూరంగా ఉండటం అన్నది కరెక్ట్ కాద‌న్న చ‌ర్చ‌లు ఇప్పుడు వ‌స్తున్నాయి. అది ప‌వ‌న్‌కే మైన‌స్‌గా మారుతుంద‌ని..ప‌వ‌న్ ఇక‌పై అయినా చుట్టూ ఉండే కోట‌రీలో త‌న‌కు న‌ష్టం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తోన్న వారిపై ఓ క‌న్నేసి ఉంచాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు..మ‌రి జ‌న‌సేనాని ఏం చేస్తాడో చూద్దాం.

 

ప‌వ‌న్‌ను క‌ల‌వ‌డ‌మే క‌ష్ట‌మా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share