బండ్ల గణేష్ అమ్మాయిల బ్రోకర్ అన్న పవన్ హీరోయిన్

February 1, 2017 at 6:25 am
2

టాలీవుడ్‌లో సాధార‌ణ క‌మెడియ‌న్‌గా ప్ర‌స్థానం ప్రారంభించిన బండ్ల గ‌ణేశ్…చాలా త‌క్కువ టైంలో బ‌డా ప్రొడ్యుస‌ర్‌గా మారిపోయాడు. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్ – ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – అల్లు అర్జున్ – రాంచ‌ర‌ణ్‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు తీసి సూప‌ర్‌హిట్లు కొట్టాడు. తాజాగా బండ్ల ఓ వెబ్ ఛానెల్ ప్ర‌తినిధికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ హీరోలు, దర్శ‌కుల‌పై చాలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

ఈ ఇంట‌ర్వ్యూ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గానే ఇప్పుడు ఓ హీరోయిన్ బండ్ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డం పెద్ద ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో బంగారం సినిమాలో న‌టించిన మీరా చోప్రా గుర్తుందా..?  తెలుగులో కొన్ని సినిమాల్లో చేసినా స‌క్సెస్ కాలేక‌పోయిన ఆమె బండ్ల ఇంట‌ర్వ్యూ త‌ర్వాత త‌న ట్విట్ట‌ర్‌లో బండ్ల గ‌ణేష్ అమ్మాయిల బ్రోక‌ర్ అంటూ ఫైర్ అయ్యింది.

బండ్ల గ‌ణేష్ ఈ ప‌నులు చేయ‌డం లేద‌ని ఎవ‌రు అంటున్నారో చూడండ‌ని ఆమె పేర్కొంది. ఆమె వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యాయి. ఆ త‌ర్వాత‌ కొద్దిసేపటికే ఆ వ్యాఖ్యలను తొలగించింది. ఇక ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్ అవ్వ‌డంతో హీరో స‌చిన్ జోషీ కూడా బండ్ల‌పై మండిప‌డ్డాడు. బండ్ల గ‌ణేష్ అలాంటి వాడేనంటూ మీరా చోప్రా వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లికాడు.

ఏదేమైనా బండ్ల‌పై మీరా చోప్రా చేసిన వ్యాఖ్య‌లపై ఇండ‌స్ట్రీలో బండ్ల గురించి ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. ఇక స‌చిన్ జోషీతో బండ్ల‌కు విబేధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే.

బండ్ల గణేష్ అమ్మాయిల బ్రోకర్ అన్న పవన్ హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share