బాలకృష్ణ కొత్త సినిమాకు పవర్ ఫుల్ టైటిల్

February 2, 2017 at 7:28 am
16

నందమూరి బాలకృష్ణకు సరిపోయే టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. ఆయా సినిమాల రిజ‌ల్ట్ ఎలా ఉన్నా బాల‌య్య సినిమాల టైటిల్స్ అన్ని ఓ రేంజ్‌లో ఉంటాయి. సింహా అనే ప‌దం బాల‌య్య‌కు ఎంత‌గా క‌లిసి వ‌స్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక లెజెండ్ చాలా ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌. ఇక అంత‌గా ఆడ‌ని ల‌య‌న్‌, డిక్టేట‌ర్ సినిమాల టైటిల్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి.

ఇక ఇటీవ‌ల త‌న కేరీర్‌లో వందో సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో హిట్ కొట్టిన బాల‌య్య త‌న 101వ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య 101వ సినిమాగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ స్టోరీని బాల‌య్య మెచ్చేలా కృష్ణ‌వంశీ రెడీ చేయ‌క‌పోవ‌డంతో బాల‌య్య ఈ ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే బాల‌య్య 101వ సినిమాగా ల‌య‌న్ ద‌ర్శ‌కుడు స‌త్య‌దేవా తెర‌కెక్కించే  ‘సార్వభౌమ’ ఉంటుంద‌ని తెలుస్తోంది. ల‌య‌న్ త‌ర్వాత స‌త్య‌దేవా బాల‌య్య కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీని బాల‌య్య కోసం రెడీ చేశాడ‌ట‌. ఇప్పటికే స్టోరీని కూడా బాలయ్యకు వినిపించి..ఓకే చెప్పించేసుకున్నాడ‌ని టాక్ ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోంది.

ఈ సినిమాకు సౌర్వ‌భౌమ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ పెట్టినట్టు కూడా స‌మాచారం. ల‌య‌న్ ప్లాప్ అయినా..ఆ సినిమా స్టోరీ కొత్త‌గా ఉండ‌డం బాల‌య్య‌కు న‌చ్చింద‌ట‌. ఈ క్ర‌మంలోనే బాల‌య్య స‌త్య‌దేవాకు మ‌రోసారి ఛాన్స్ ఇస్తున్నాడ‌ని అంటున్నారు.

బాలకృష్ణ కొత్త సినిమాకు పవర్ ఫుల్ టైటిల్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share