బాహుబ‌లిపై పూరి సెటైర్లు..!

April 15, 2017 at 11:56 am
80

తెలుగు సినిమాకు ప్ర‌పంచ‌స్థాయిలో గుర్తింపు పొందిన బాహుబ‌లి సినిమా అన్నా, రాజ‌మౌళి అన్నా ఇండియా వాళ్ల‌కు ఉన్న గౌర‌వం గురించి చెప్ప‌క్క‌ర్లేదు. అందుకే వాళ్లంతా ఈ నెల 28న వ‌స్తోన్న బాహుబ‌లి కోసం ఏరేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటి బాహుబ‌లి సినిమాపై టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మాత్రం కాస్త సైటైరిక‌ల్‌గా స్పందించ‌డంతో ఈ న్యూస్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

బాహుబ‌లి లాంటి సినిమా కోసం తాను కొన్ని సంవ‌త్స‌రాల పాటు టైం వేస్ట్ చేయ‌లేన‌ని, వంద‌ల కోట్లు పెట్టి ఇలాంటి సినిమా తీయ‌డం కంటే అలాంటి సినిమాను త‌న వంద రూపాయ‌లు పెట్టి చూసేందుకే ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పారు. ఒకే సినిమా కోసం రెండేళ్ల పాటు స్క్రిఫ్ట్ వ‌ర్క్ చేయ‌డం, మ‌రో రెండేళ్ల పాటు షూటింగ్‌లు చేయ‌డం లాంటి త‌తంగాలు త‌న‌కు న‌చ్చవ‌ని పూరి ఓపెన్‌గానే చెప్పేశాడు.

ఇక త‌న సినిమాకు తాను రాసుకునే స్క్రిఫ్ట్ కంటే రెండేళ్లు అన్న టైం చాలా విలువైంద‌ని…. ఒక సినిమా కోసం త‌న యూనిట్‌ను రెండు సంవ‌త్స‌రాల పాటు క‌ష్ట‌పెట్టి, వారితో అంత టైం వేస్ట్ చేయించ‌లేన‌ని పూరి చెప్పాడు.ఇక ఓ సినిమా కోసం తాను రాసుకున్న క‌థ రెండు నెల‌ల‌కు త‌న‌కే బోర్ కొట్టేస్తుంద‌ని…అలాంటిది రెండేళ్లు వర్క్ చేసి బాహుబలి లాంటి సినిమా చేయడం తనవల్ల కాదని అంటున్నాడు పూరి.

బాహుబ‌లిపై పూరి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చాలా వ్య‌గ్యంగా ఉన్నాయ‌న్న గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి.

బాహుబ‌లిపై పూరి సెటైర్లు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share