బాహుబ‌లి -2 తెలుగు వెర్ష‌న్ బిజినెస్…మైండ్ బ్లాకే

January 31, 2017 at 5:51 am
Bahubali

బాహుబ‌లి సృష్టించిన రికార్డుల దెబ్బ‌కు బాహుబ‌లి-2 బిజినెస్ మామూలుగా జ‌ర‌గ‌డం లేదు. అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని బాహుబ‌లి-2 ఈ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బాహుబ‌లి రూ.600 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డంతో బాహుబ‌లి -2 బిజినెస్ ఆకాశామే హ‌ద్దు అన్న‌ట్టుగా జ‌రుగుతోంది.

మ‌రో షాక్ ఏంటంటే బాహుబ‌లి సాధించిన వ‌సూళ్ల‌కంటే ఎక్కువ స్థాయిలో బాహుబలి 2 బిజినెస్ జ‌రుగుతోంది. తెలుగు వెర్ష‌న్ వ‌ర‌కు చూసుకుంటే బాహుబ‌లి ఏపీ, తెలంగాణ‌లో రూ.66 కోట్ల‌కు అమ్మితే లాంగ్ ర‌న్‌లో ఇక్క‌డే రూ.110 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇప్పుడు బాహుబ‌లి 2 కేవ‌లం ఏపీ, తెలంగాణ‌లోనే రూ.130 కోట్ల‌కు అమ్ముడైంది.

బాహుబ‌లి సాధించిన వ‌సూళ్ల కంటే మ‌రో రూ.20 కోట్లు అద‌నంగా వ‌సూళ్లు చేస్తే త‌ప్ప బాహుబ‌లి 2 బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చిన‌ట్లు కాదు. ఏపీ, తెలంగాణ‌, ఓవర్సీస్‌, త‌మిళ్‌, హిందీ ఇలా ఎక్క‌డ చూసుకున్నా బాహుబ‌లి సాధించ‌న వ‌సూళ్ల కంటే ఎక్కువ రేట్ల‌కు ఈ సినిమా అమ్ముడైంది.

నైజాంలో బాహుబ‌లిని రూ.23 కోట్ల‌కు అమ్మితే బాహుబ‌లి 2 రూ.47 కోట్ల‌కు అమ్ముడైందని తెలుస్తోంది. సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల దృష్ట్యా బాహుబ‌లి అమ్మిన రేట్ల‌ను సులువుగానే వ‌సూలు చేస్తుంద‌ని ట్రేడ్ లెక్క‌లు వేస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాహుబ‌లి 2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని తెలుస్తోంది.

 

బాహుబ‌లి -2 తెలుగు వెర్ష‌న్ బిజినెస్…మైండ్ బ్లాకే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share