బాహుబ‌లి 2 త‌ర్వాత రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఫిక్స్‌

December 17, 2016 at 9:59 am
Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 త‌ర్వాత తీసే సినిమాపై ఇండియ‌న్ సినిమా వ‌ర్గాల్లో ఎక్క‌డ లేని ఆస‌క్తి నెల‌కొంది. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజ‌మౌళి ఓ చిన్న హీరోతో చిన్న సినిమా చేస్తాడ‌ని ముందు రూమ‌ర్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఈగ‌కు సీక్వెల్‌గా ఈగ 2 ఉంటుందని, కాదు కాదు గ‌రుడ ఆ త‌ర్వాత త‌న డ్రీమ్ ప్రాజెక్టు అయిన మ‌హాభార‌తం ఉంటుంద‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి.

మ‌రికొంద‌రు అయితే అమీర్‌ఖాన్‌తో రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఉంటుంద‌ని అన్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌పెక్ట్ అమీర్‌ఖాన్‌తో రాజ‌మౌళి నెక్ట్స్ మూవీ ఉంటుంద‌న్న మ్యాట‌ర్ బీ టౌన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

రాజ‌మౌళి గ‌రుడ‌, మ‌హాభార‌తం లాంటి ప్రాజెక్టుల‌ను ఇప్ప‌ట్లో త‌ల‌కెత్తుకునే స్థితిలో లేడ‌ట‌. ముందుగా అమీర్‌ఖాన్‌తో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా తీసి..ఆ త‌ర్వాత గ‌రుడ‌, మ‌హాభార‌తం లాంటి ప్రాజెక్టును టేకాఫ్ చేసే ప్లాన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలోనే ఈ వార్త‌లు వ‌చ్చినా రాజ‌మౌళి ఖండించ‌డం వెన‌క వేరే మ్యాట‌ర్ ఉంద‌ట‌.

బాహుబలి 2 పూర్తి కాకుండానే తరువాతి సినిమా గురించి ప్రచారం జరగడం ఇష్టం లేకనే అమీర్‌ఖాన్ సినిమా వార్తలను ఖండించాడట. మ‌రి అమీర్‌తో రాజ‌మౌళి సినిమా అంటే బాహుబ‌లిని మించిన సినిమాను ఎక్స్‌పెక్ట్ చేయ‌వ‌చ్చేమో.

 

బాహుబ‌లి 2 త‌ర్వాత రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఫిక్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share