బిగ్ బీతో రెజీనా అదరగొట్టేసింది

August 18, 2016 at 11:01 am
rejina amithab

టాలీవుడ్ లో అవకాశాలు లేక ఎండమావిలా మారిన రెజీనా కెరీర్ కు బాలీవుడ్ నుండి ఊహించని ఆఫర్ వచ్చింది.అది అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు.బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది.ఆంఖేన్2 గా రూపొందనున్న ఈ సినిమాలో అమితాబ్, రెజీనాలతో పాటు ఇంకా అనీల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలుగా ‘ఆంఖేన్’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు.

అమితాబ్ క్లాప్స్ కొడుతుండగా రెజీనా రాంప్ వాక్ చేస్తున్న దృశ్యాన్ని ట్విట్టర్ లో షేర్ చేసింది రెజీనా.ఈ చిత్రం లో ఇలియానా ఒక హీరోయిన్ గా నటిస్తుండగా నెగెటివ్ షేడ్ ఉన్న మరో హీరోయిన్ పాత్ర కోసం రెజీనా ఎంపికైంది.అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం నెక్స్ట్ ఇయర్ లోనే అంటున్నారు మరి.

అయితే తానేమీ బాలీవుడ్ అవకాశంకోసం వెంపర్లాడ లేదని వాళ్ళే తనని వెతుక్కుంటూ వచ్చి ఈ అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చిది ఈ అమ్మడు.అవకాశాలు లేక ఏ సినిమా అయినా సై అనే స్టేజి లో రెజీనా ఉందనేది ఇంకో టాక్ అనుకోండి.అందులో భాగంగానే కమెడియన్స్ పక్కన కూడా హీరోయిన్ గా చేసేస్తోంది.టాలీవుడ్ లో చిన్న సినిమా అనగానే ఇప్పుడు ఠక్కున గుర్తొచ్చే పేరు రెజీనానే.ఎందుకంటే పారితోషకం పెద్దగా డిమాండ్ చేయదు..హీరో ఎవరైనా ఓకే అనేస్తోంది మరి రెజీనా.ఇలాంటి టైం లో పాపకి బాలీవుడ్ బిగ్ బి పక్కన ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు మరి.

అయితే ఈ షూట్ లో భాగాంగా రెజీనా చిందులేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో భాగంగా వైరల్ అయ్యాయి.ఎంత బాలీవుడ్ ఛాన్స్ వస్తే మాత్రం ఈ రేంజ్ లో అందాలు ఆరబోయాలా అంటున్నారు.అంతే మరి..బి ఏ రోమన్ ఇన్ రోం అన్నారు కదా పాపం రెజీనా దాన్నే బాగా వంటబట్టించుకుంది.

బిగ్ బీతో రెజీనా అదరగొట్టేసింది
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share