మహేష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..పండగే పండగ

February 3, 2017 at 9:49 am
26

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు – కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా (వ‌ర్కింగ్ టైటిల్ ఏజెంట్ శివ‌) షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా బ్యాలెన్స్ ఉన్న 20 శాతం షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే కంప్లీట్ చేసుకోనుంది. ఇక బ్ర‌హ్మోత్స‌వం డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో మ‌హేష్ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌తో వెయిట్ చేస్తోన్న మ‌హేష్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది.

ఈ సినిమా రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకి ఈ సినిమా టాకీ పార్టు  పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాను జూన్ 23 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారనేది తాజా సమాచారం. ‘ఉగాది’ రోజున ఫస్టులుక్ విడుదల చేసి, అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌ కొనసాగిస్తారని స‌మాచారం.

రూ. 90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. మ‌హేష్ సీక్రెట్ ఏజెంట్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌హేష్‌కు జోడీగా ర‌కుల్‌ప్రీత్‌సింగ్ న‌టిస్తోంది. ఈ సినిమ ప్రి రిలీజ్ బిజినెస్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూ.130 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

మహేష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..పండగే పండగ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share