మెగాస్టార్‌కు షాక్ ఇచ్చిన వెంకీ

December 29, 2016 at 10:23 am
venaktesh

మెగాస్టార్ చిరంజీవికి విక్ట‌రీ వెంక‌టేష్ బిగ్ షాక్ ఇచ్చారు. చిరు త‌న కేరీర్‌లోనే ప్రెస్టేజియ‌స్ మూవీగా న‌టించాల‌నుకున్న ఓ సినిమా కోసం ముందుగా ఓకే చేసి త‌ర్వాత రిజెక్ట్ చేసిన స్టోరీని ఇప్పుడు వెంకీ ఓకే చేశాడ‌ని తెలుస్తోంది. చిరు కేరీర్‌లో 150వ సినిమా కోసం ముందుగా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ను డైరెక్ట‌ర్‌గా అనుకున్నారు.

పూరియే చిరు 150వ సినిమా డైరెక్ట‌ర్ అంటూ ఆ సినిమా నిర్మాత రాంచ‌ర‌ణ్ కూడా స్వ‌యంగా ఎనౌన్స్ చేశాడు. త‌ర్వాత ఆ క‌థ‌లో సెకండాఫ్ చిరుకు స‌రిగా న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. త‌ర్వాత చిరు కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక నాడు చిరు రిజెక్ట్ చేసిన స్టోరీనే ఇప్పుడు పూరి విక్ట‌రీ వెంక‌టేష్‌కు చెప్పి ఓకే చేయించుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం గురులో న‌టిస్తోన్న వెంకీ ఈ సినిమా త‌ర్వాత తిరుమ‌ల కిషోర్‌తో ఆడాళ్లా మీకు జోహార్లు సినిమాలో చేయాల‌నుకున్నాడు. ఆ స్టోరీ వెంకీ అన్న సురేష్‌బాబుకు న‌చ్చ‌క‌పోవ‌డంతో ఇప్పుడు పూరితో వెంకీ ఓ సినిమాకు క‌మిట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

వెంకీకి పూరి చెప్పిన క‌థ చిరు 150వ సినిమా కోసం రెడీ చేసుకున్న‌దే అని స‌మాచారం. ఆ ప్రాజెక్టుకు ఆటోజానీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాారు. మ‌రి చిరు క‌థ‌తోనే వెంకీతో చేస్తోన్న పూరి అదే ఆటోజానీ టైటిల్‌ను పెడ‌తాడా ? లేదా వెంకీ కోసం కొత్త టైటిల్ ఆలోచిస్తాడా ? అన్న‌ది చూడాలి.

 

మెగాస్టార్‌కు షాక్ ఇచ్చిన వెంకీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share