మ‌హేష్ – మురుగ‌దాస్ స్టోరీ లైన్ ఎక్స్‌క్లూజివ్‌

December 18, 2016 at 6:22 am
mahesh

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు – కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ సినిమాపై సౌత్ ఇండియాలోనే భారీ అంచ‌నాలు ఉన్నాయి. రూ.90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మ‌హేష్‌కు ఎలాంటి ఇమేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మురుగ‌దాస్ రొటీన్ భిన్న‌మైన క‌థాంశాల‌ను ఎంచుకుంటాడు.

సోష‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ మిస్ కాకుండా సినిమాలు తెర‌కెక్కించ‌డంలో మురుగ‌దాస్‌కు తిరుగులేదు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మ‌హేష్‌తో చేస్తోన్న సినిమా (వ‌ర్కింగ్ టైటిల్ ఏజెంట్ శివ‌) స్టోరీ లైన్ గురించి కూడా ఓ ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య సాగే పోరాటంతో ఈ సినిమా క‌థ ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల్లో ఒక‌డు స‌మాజ హితం కోసం ఫైట్ చేస్తుంటే, రెండో వాడు చెడ్డ‌వాడిగా క‌నిపిస్తాడ‌ట‌. ఈ స్టోరీ లైన్ చూస్తుంటే ఈ సినిమాలో మ‌హేష్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడా ? లేదా మ‌హేష్‌కు సోద‌రుడి రోల్‌లో ఎవ‌రైనా మ‌రో న‌టుడు న‌టించ‌నున్నాడా ? అన్న దానిపై క్లారిటీ లేదు. ఈ స్టోరీ మురుగ‌దాస్ స్టైల్లో చాలా ఇన్సెంటివిటీతో న‌డుస్తుంద‌ట‌.

ఈ సినిమాలో మ‌హేష్‌కు జోడీగా ర‌కుల్‌ప్రీత్‌సింగ్ న‌టిస్తుండ‌గా, విల‌న్‌గా ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య న‌టిస్తున్నాడు. మ‌రో న‌టుడు భ‌ర‌త్ కూడా మ‌రో రోల్‌లో న‌టిస్తున్నాడు. జ‌న‌వ‌రి 1న నూత‌న సంవ‌త్స‌రం కానుక‌గా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి, సంక్రాంతికి టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. వ‌చ్చే యేడాది ఏప్రిల్‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

 

మ‌హేష్ – మురుగ‌దాస్ స్టోరీ లైన్ ఎక్స్‌క్లూజివ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share