రాంచ‌ర‌ణ్‌కు ఆ ఇద్ద‌రు హీరోలంటే ప‌డ‌దా..!

December 20, 2016 at 5:55 am
ramcharan

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్ ప్ర‌స్తుతం ధృవ హిట్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. రెండు వ‌రుస ప్లాపుల త‌ర్వాత మ‌నోడి ఖాతాలో ధృవ రూపంలో హిట్ రావ‌డంతో ఆనందానికి అవ‌ధులే లేవు. రాంచ‌ర‌ణ్‌కు టాలీవుడ్‌లో మిగిలిన యంగ్ హీరోల‌తో కూడా మంచి రిలేష‌న్ ఉంది. ఇత‌ర హీరోల సినిమాలు హిట్ అయిన‌ప్పుడు చ‌ర‌ణ్ వారికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెపుతుంటాడు.

చ‌ర‌ణ్‌కు టాలీవుడ్ స్టార్ యంగ్ హీరోలు అయిన మహేష్‌, ఎన్టీయార్‌, అఖిల్‌, ప్రభాస్‌, రానాతో చరణ్‌కు మంచి స్నేహముంది. ఇలాంటి చరణ్‌కు తెలుగు సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోలంటే చాలా అసూయట. ఆ ఇద్ద‌రు హీరోలు అంటే త‌న‌కు చాలా అసూయ అన్న విష‌యాన్ని చ‌ర‌ణ్ స్వ‌యంగా చెప్పాడు.

ధృవ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న చ‌ర‌ణ్ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు యంగ్ హీరోలు శర్వానంద్‌, నానిలను చూస్తే చాలా అసూయని చెప్పాడు. శర్వానంద్ – నాని క‌థ‌ల‌ను ఎంపిక చేసుకునే తీరు చూస్తుంటే త‌న‌కు చాలా అసూయ క‌లుగుతుంద‌ని వారి క‌థ‌ల ఎంపిక‌ను మెచ్చుకున్నాడు.

ఇక ఈ విష‌యంలో వాళ్లిద్ద‌రిని చూసి తాను జెల‌సీగా ఫీల‌వుతా అని కూడా చెర్రీ చెప్పాడు. శ‌ర్వా, నానిలాగా చాలా విభిన్న‌మైన క‌థ‌ల్లో న‌టించాల‌న్న కోరిక త‌న‌కు ఉంద‌న్న విష‌యాన్ని చ‌ర‌ణ్ వెల్ల‌డించాడు.

 

రాంచ‌ర‌ణ్‌కు ఆ ఇద్ద‌రు హీరోలంటే ప‌డ‌దా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share