ర‌త్తాలుతో నంద‌మూరి హీరో రొమాన్స్‌

January 27, 2017 at 10:45 am
NTR

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో ఓ మాంచి మాస్ బీట్ ఉండ‌డం కామ‌న్ అయిపోయింది. మాస్ బీట్ ఉంటే ఉండే కిక్కేవేరు. అందుకే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో ఐటెం సాంగుల్లో చేసేందుకు స్టార్ హీరోయిన్లు సైతం రెడీ అవుతున్నారు. ఈ ఐటెం సాంగుల‌తో ఆయా హీరోల అభిమానుల‌తో పాటు బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కులు మ‌స్తుగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ ఐటెం సాంగుల్లో చిందేసే స్టార్ హీరోయిన్ల‌కు సైతం భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేస్తుండడంతో వారు కూడా ఈ సాంగుల‌కు సై అంటున్నారు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో ర‌త్తాలు ర‌త్తాలు సాంగ్‌లో చిరు ప‌క్క‌న చిందేసిన రాయ్‌ల‌క్ష్మీ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద ఐటెం పాప అయిపోయింది.

ఆమె స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలో సైతం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌క్క‌న తోబ..తోబ సాంగులో చిందేసి కుర్ర‌కారును మెప్పించింది. ఈ క్ర‌మంలోనే వరుసగా రెండు సూపర్ హిట్ ఐటమ్ నెంబర్స్ లో నటించిన లక్ష్మీరాయ్ ఇప్పుడు నంద‌మూరి యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఐటెం సాంగ్ చేసేందుకు రెడీ అవుతోంద‌ట‌.

జ‌న‌తా గ్యారేజ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ఎన్టీఆర్ బాబి డైరెక్ష‌న్‌లో ఓ సినిమాలో (వ‌ర్కింగ్ టైటిల్ జై ల‌వ కుశ ) న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ్యారేజ్‌లో కూడా కాజ‌ల్ ప‌క్కా లోక‌ల్ సాంగ్‌లో న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్‌-బాబి ఈ సినిమాలో రాయ్‌ల‌క్ష్మీతో ఐటెం సాంగ్ చేయించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. మ‌రి ర‌త్తాలు ఎన్టీఆర్ ప‌క్క‌న ఏ రేంజ్‌లో రెచ్చిపోతుందో చూడాలి.

 

ర‌త్తాలుతో నంద‌మూరి హీరో రొమాన్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share