వంగ‌వీటిలో ఎన్టీఆర్ రోల్‌పై టీడీపీలో హైటెన్ష‌న్‌

December 22, 2016 at 10:15 am
NTR

రాంగోపాల్ వ‌ర్మ లేటెస్ట్ మూవీ వంగ‌వీటి రేపు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా ఎలా ఉంటుందా అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉన్నా….కృష్ణా – గుంటూరు – ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల్లో మాత్రం మిగిలిన ఏరియాల ప్రేక్ష‌కుల‌ను మించిన ఆస‌క్తి నెల‌కొంది. ఇదిలా ఉంటే వంగ‌వీటి సినిమాపై టీడీపీ వ‌ర్గాల్లో కూడా ఎక్క‌డా లేని ఆస‌క్తి అనేక‌న్నా…హైటెన్ష‌న్ నెల‌కొంది. వంగ‌వీటిలో ఎన్టీఆర్ రోల్‌ను వ‌ర్మ ఎలా డీల్ చేశాడా అన్న‌దానిమీదే టీడీపీ వ‌ర్గాల్లో ఆస‌క్తి ఉంది.

వంగ‌వీటి రంగా హ‌త్య జ‌రిగిన‌ప్పుడు టీడీపీ అధికారంలో ఉండ‌గా, ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. ఈ హ‌త్య ఏపీలో రెండు ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గాలు అయిన క‌మ్మ‌, కాపు మ‌ధ్య తీవ్ర అగాధానికి కార‌ణ‌మైంది. ఈ హ‌త్య జ‌రిగిన‌ప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారు ? టీడీపీ ఎలా స్పందించింది ? ఈ అంశాల‌ను ఇప్పుడు వ‌ర్మ వంగ‌వీటిలో ఎలా చూపించారన్న‌దాని కోస‌మే చాలా మంది వెయిట్ చేస్తున్నారు.

గ‌తంలో ర‌క్త‌చ‌రిత్ర సినిమాలో వ‌ర్మ ఎన్టీఆర్ రోల్‌ను చాలా తెలివిగా డీల్ చేసి కాంట్ర‌వర్సీ లేకుండా చూసుకున్నాడు. ఇప్పుడు వంగ‌వీటిలో వ‌ర్మ ఎన్టీఆర్ రోల్‌తో పాటు, క‌మ్మ‌-కాపు సామాజిక‌వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌ల‌ను ఎలా చూపించాడ‌న్న‌దానిపై విజ‌య‌వాడ‌లోను, టీడీపీ వ‌ర్గాల్లోను హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం క్రియేట్ అయ్యింది.

ఈ సినిమా కోసం ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌లో తొలి రోజు ఆట‌ల‌కు అన్ని టిక్కెట్లు ఫుల్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దాదాపు రూ.12 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ర‌న్ టైం 2 గంట‌ల 22 నిమిషాలు. ఇక సినిమా రిలీజ్‌కు ముందుగా మ‌రింత హైప్ తీసుకు వ‌చ్చేందుకు వ‌ర్మ వ‌దిలిన లేటెస్ట్ ట్రైల‌ర్‌లో ప‌సుసు జెండాలు క‌నిపించ‌డంతో పాటు సీఎం కాన్వాయ్ క‌నిపిస్తుండ‌డం… ముర‌ళి వ‌ర్సెస్ రాధా గొడ‌వ‌లు చూపించ‌డంతో వంగ‌వీటిపై మ‌రింత ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

 

వంగ‌వీటిలో ఎన్టీఆర్ రోల్‌పై టీడీపీలో హైటెన్ష‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share