సింగం 3 అభిమానులకు మళ్ళీ నిరాశే

February 9, 2017 at 6:21 am
surya

తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నిర్మించిన సింగం 3 కి మొదటినుంచి తెలుగులో రిలీజ్ చేయటానికి అనేక ఆటంకాలు కలుగుతూనే వున్నాయి. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈరోజు రిలీజ్ అవటం కాయమవ్వగా ఇప్పుడు మళ్ళీ బ్రేక్ పడింది.

ఈరోజు తెలుగు, తమిళ రాష్ట్రాలలో ఒకేసారి రిలీజ్ అవ్వాల్సి ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి బ్రేక్ పడింది. అయితే దీనికి కారణాలు పూర్తిగా తెలియరాలేదు కానీ ఫిలింనగర్ లో మాత్రం ఫైనాన్స్ క్లిరెన్స్ చేయకపోవటం వల్లనే రిలీజ్ అవ్వనీయలేదనే టాక్ వినిపిస్తుంది.

సింగం సిరీస్ లో వచ్చిన మొదటి రెండుభాగాలు తెలుగులో మంచివిజయాలనే సాధించాయి.  దీంతో సింగం 3 పైన తెలుగులో కూడా మంచి అంచనాలే వున్నాయి. దీంతో సూర్య అభిమానులు మ్యాట్నీ షో టైం కి అయినా రిలీజ్ అవుతుందేమోనని ఎదురు చూస్తున్నారు.

సింగం 3 అభిమానులకు మళ్ళీ నిరాశే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share