సౌత్ లో రజిని కాదు …ఇక కాటంరాయుడు

February 7, 2017 at 6:47 am
47

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమాపై అభిమానుల్లో ఏ రేంజ్‌ల అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కాట‌మ‌రాయుడు ఉగాది కానుక‌గా మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచేస్తూ కాట‌మ‌రాయుడు టీజ‌ర్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తోంది.

కాట‌మ‌రాయుడు టీజ‌ర్ కేవ‌లం 60 గంట‌ల్లోనే ఐదు మిలియ‌న్ల వ్యూస్ రాబ‌ట్టింది. ఇది సౌత్ ఇండియా సినిమా స‌ర్కిల్స్‌లో పెద్ద రికార్డుగా నిలిచింది. సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి సినిమా టీజ‌ర్ త‌ర్వాత కాట‌మ‌రాయుడు టీజ‌రే పెద్ద రికార్డుగా నిలిచింది.

లైక్స్ విషయంలో కబాలిని కూడా దాటేసిన కాట‌మ‌రాయుడు 173కే లైక్స్‌ సాధించింది. కాట‌మ‌రాయుడు టీజ‌ర్ యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచింది. కోలీవుడ్‌లో అజిత్ హీరోగా తెర‌కెక్కి హిట్ అయిన వీరం  సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ప‌వ‌న్ ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో న‌టిస్తున్నాడు.

రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు గోపాల‌..గోపాల ఫేం డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా…నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌వ‌న్ స‌న్నిహితుడు శ‌ర‌త్‌మ‌రార్ నిర్మిస్తున్నాడు.

సౌత్ లో రజిని కాదు …ఇక కాటంరాయుడు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share