సౌత్ హీరోయిన్‌తో స‌ల్మాన్ డేటింగ్‌

December 3, 2016 at 6:06 am
salmankhan

ఎమీ జాక్స‌న్ ఆర్య 1947 ఏ ల‌వ్‌స్టోరీ సినిమాతో సౌత్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన ఈ బ్యూటీ విక్ర‌మ్ – శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన ఐ సినిమాతో ఇండియా వైజ్‌గా పాపుల‌ర్ అయ్యింది. ఆ సినిమా ప్లాప్ అయినా ఆ సినిమా కోసం అమీ ప‌డిన క‌ష్టాన్ని గుర్తించిన శంక‌ర్ మ‌రోసారి త‌న 2.0 సినిమాలో సైతం ఆమెకే హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు.

విక్ర‌మ్ – ర‌జ‌నీ కాంబోలో వ‌స్తోన్న 2.0లో ఎమీనే హీరోయిన్‌. ఇక బ్రిటీష్ బ్యూటీ ఇప్పుడు ఓ స్టార్ హీరోతో డేటింగ్‌కు సై అంటోంది. ఇటీవ‌ల బాలీవుడ్ చిత్రం ఏక్ దీవానాలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర హీరో ప్రతీక్ బాబర్‌తో ప్రేమకలాపాలు నడిపిన ఎమీజాక్సన్ ఆ తరువాత వారి ప్రేమ బ్రేకప్ అవ్వడంతో కొంత కాలం సెలైంట్‌గా ఉంది.

తాజాగా కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌తో ఆమె చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతుంద‌న్న ప్ర‌చారం సోషల్‌మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ విష‌యం ఆ నోటా …ఈ నోటా ఎమీ చెవిలో ప‌డింది. తానిప్ప‌ట‌కీ ఒంట‌రిగానే జీవిస్తున్నాన‌ని చెప్పిన అమీ…స‌ల్మాన్‌ఖాన్‌తో డేటింగ్ ఎవ‌రు మాత్రం చేయ‌రు చెప్పండ‌ని ప్ర‌శ్నించింది.

స‌ల్మాన్ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని… బాలీవుడ్‌లో తనకు మార్గదర్శి అని పేర్కొంది. స‌ల్మాన్ త‌న ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోన్న తీరు త‌న‌కు ఎంతో ఆద‌ర్శ‌న‌మ‌ని చెప్పింది. ఇటీవ‌ల ఆయ‌న త‌క్కువ టైంలోనే 20 కేజీల బ‌రువు త‌గ్గార‌ని… ఇటీవ‌ల ఆయ‌న్ను క‌లిసిన‌ప్పుడు ఇదెలా సాధ్యం సార్ అని అడిగేశాన‌ని ఎమీ చెప్పింది.

ఇక స‌ల్మాన్‌తో త‌న‌కు ఉన్న‌ది మంచి స్నేహ‌మే త‌ప్ప…ప్రేమ కాద‌ని ఎమీ చెపుతున్నా బాలీవుడ్ జ‌నాలు మాత్రం స‌ల్మాన్‌తో ఎమీ చెట్టాప‌ట్టాల మ్యాట‌ర్ నుంచి ఆమె స‌ల్మాన్‌పై కురిపిస్తోన్న ప్ర‌శంస‌లు చూసి వారిద్ద‌రి మ‌ధ్య వ్య‌వ‌హారం చాలా ముదిరిపోయే వ‌ర‌కు వెళ్లింద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు.

 

సౌత్ హీరోయిన్‌తో స‌ల్మాన్ డేటింగ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share