అందాల భామ చైనా వెలుగులు

బాలీవుడ్‌ అందాల భామగా ఒకానొక కాలంలో యువ హృదయాల్ని కొల్లగొట్టిన సెక్సిణి మల్లికా షెరావత్‌ ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించడంలేదు. అయితే చైనాలో మాత్రం ఓ అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. జాకీచాన్‌ ప్రధాన పాత్రలో ‘ది మిత్‌’ అనే సినిమా రాగా, అందులో మల్లికా షెరావత్‌ నటించింది. ఆ చిత్రమే మరో చైనా సినిమాలో మల్లికకి అవకాశం తెచ్చినట్లుంది.

పదేళ్ళ తర్వాత చైనా సినిమాలో నటిస్తోంది మల్లికా షెరావత్‌. ఈ సినిమా పేరు ‘టైమ్‌ రైడర్స్‌’. విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానుభూతులకు లోనుచేయనుందట. డేనియల్‌ లీ ఈ చిత్రానికి దర్శకుడు. లీ విజన్‌ పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న యాక్షన్‌ అడ్వంచర్‌ చిత్రమిది. ఇందులో మల్లికా షెరావత్‌ చేసే సాహసాలు అద్భుతంగా ఉంటాయట. అలాగే మల్లికా షెరావత్‌ అందాల విందు కూడా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది.

‘ది మిత్‌’ సినిమా కోసం మల్లికా షెరావత్‌ మరీ అంతగా అందాల ఆరబోత చేయలేదుగానీ, చేసిన ఆ కాస్త అందాల ఆరబోత (ఓ సన్నివేశంలో టాప్‌లెస్‌గా కనిపిస్తుంది)ని ఇండియన్‌ సినిమాలో కట్‌ చేసేశారు. ‘టైమ్‌ రైడర్స్‌’ సినిమా విడుదలైతే మల్లిక అడ్వంచర్స్‌తోపాటు ఆమె అందాల్నీ ఆస్వాదించే అవకాశం దొరుకుతుంది.