అందుకే లిప్ లాక్ కు నో చెప్పిన సల్లుభాయ్

బాలీవుడ్ లో లిప్ లాక్ సీన్స్ సర్వసాధారణం అయిపోయాయి. చిన్న సినిమానుండి పెద్ద సినిమా వరకు లిప్ లాక్ సీన్లు ఉంటూనే ఉన్నాయి. హీరోయిన్లు కూడా ఇప్పుడిది కామన్ లే అని మారం చేయకుండా ఒప్పేసుకుంటున్నారు. అలాంటిది బాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉన్న సల్మాన్ ఖాన్ మాత్రం లిప్ లాక్ సీన్ కి నో చెబుతున్నాడు.అందునా అనుష్క శర్మ తో ససేమిరా అనేసాడట.
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ స్టార్ డమ్ తో సమానమైన అమీర్ ఖాన్ లిప్ లాక్ లు చేయడానికి అభ్యంతరం లేదని చెప్పేసాడు.ఇక షారూఖ్ కూడా జబ్ తక్ హై జాన్ లో కత్రీనాతో లిప్ లాక్ సీన్ చేసాడు.అయితే హీరోయిన్లతో బోలెడన్ని అఫైర్లు వున్నాయని పేరు పొందిన సల్మాన్ ఖాన్ మాత్రం లిప్ లాక్ అంటే ఆమడ దూరం పరుగెడుతాడట.అయితే ఇండస్ట్రీకి వచ్చి ముప్పై ఏళ్ళు దాటినా సల్మాన్ ఖాన్ మాత్రం ఆ లిప్ లాక్ భయం పోలేదట.

రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటిస్తున్న “సుల్తాన్” సినిమాలో అనుష్క శర్మ తో లిప్ లాక్ సీన్ చేయాల్సి వచ్చిందట. అయితే సల్మాన్ కి ఆవిషయం చెప్పగానే వెంటనే నో చెప్పాడట.ఎంత నచ్చ చెప్పినా ససేమిరా అనడంతో చేసేది లేక డైరెక్టర్ డ్రాప్ అయ్యాడట.కేవలం పై పైన పెదాలు ఆనించి లిప్ లాక్ ఎఫెక్ట్ వచ్చేలా ప్రయత్నించారట.అదికూడా సింగిల్ టేక్ లో క్లోజ్ చేయాలని సల్మాన్ ఖాన్ కండీషన్ పెట్టాడట.