అఖిల్ ఫైట్స్ కోసం 10 కోట్లు ఖర్చు పెడుతున్న నాగార్జున

అక్కినేని 3 వ తరం హీరోల్లో ఒకడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా తో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాడు. అయితే సినిమా రిలీజ్ కి ముందు మాత్రం నాగ చైతన్య మొదటి సినిమా కంటే ఎక్కువ బజ్ నే సంపాదించుకోగలిగాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఒక్క సినిమా హిట్ కొట్టాడంటే చాలు అఖిల్ స్టార్ హీరో అయిపోవటానికి అనిపిస్తుంది. మొదటిసినిమా తో అంచనాలు అందుకోలేకపోవటంతో రెండవ సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలనే ఆలోచనలో పడిపోయినట్టున్నాడు అందుకే మొదటిసినిమా రిలీజ్ సంవత్సరం పూర్తయ్యి రెండోసంవత్సరం గడుస్తున్నా ఇంకా సెకండ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయలేదు.

అయితే ఇప్పుడు అఖిల్ రెండో మూవీ మనం మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో చేయటానికి సిద్ధమయ్యాడు ఆ సినిమా గురించి ఒకఆసక్తికరమయిన విషయం టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాకోసం 10 కోట్లు ఖర్చుపెట్టి ఆక్షన్ సన్నీ వేశాలు చిత్రీకరించాలని డిసైడ్ అయ్యాడట నాగార్జున. అందుకే ఈ సినిమాకోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ని తీసుకొస్తున్నాడట. అయితే రెండో సినిమాకే ఇంతకర్చుపెట్టి యాక్షన్ సన్నివేశాలను తీయటమంటే కొంచెం రిస్క్ అయినప్పటికీ ఫైట్స్ లో ఫ్రెషన్స్ కనిపించటం వల్ల  సినిమాకి అదే పెద్ద అసెట్ అవుతుందంటున్నారు సినీ విశ్లేషకులు.

డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ రకం సినిమాలు ఇప్పటివరకు చేయనప్పటికీ ఈ సినిమాని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన ఈ స్టోరీ అద్భుతంగా ఉందని ఇన్సైడ్ వర్గాల టాక్. అక్కినేని నాగార్జున ప్రొడ్యూసర్ గా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారం లో షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాకి హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. మనం మూవీ కి సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి కూడా సంగీతం అందించనున్నాడు.