అనుష్కకి కష్టాలు

నాజూకైన శరీరంతో వెండితెరను ఏలిన అనుష్కను సైజ్‌జీరో కష్టాలు ఇంకా వదలలేదు. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం విపరీతంగా స్వీట్లు తినేసి లావెక్కిపోయింది. ఇప్పుడు ఆ బరువు తగ్గించుకోవడానికి అనుష్క నానా కష్టాలూ పడుతోంది.

యోగా, వ్యాయామం ఏది చేసినా పెద్దగా లాభం కనబడడం లేదు.అందుకే జిమ్‌కెళ్లడం మానేసి హైదరాబాద్ రోడ్లను ఆశ్రయిస్తోందట. ముఖానికి మాస్క్ ధరించి హైదరాబాద్ రోడ్లపై 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తోందట. తన తదుపరి సినిమాల్లో క్యారెక్టర్ల కోసం అనుష్క ఇంత విపరీతంగా కష్టపడు తోందన్నమాట. అనుష్క ప్రస్తుతం బాహుబలి-2, సింగం-3, భాగ్‌మతి, ఓం నమో వేంకటేశాయ సినిమాల్లో నటిస్తోంది.