ఆ ఒక్క కారణం చేత మెగా హీరో తో ఛాన్స్ కోల్పోయింది

ఇప్పుడు ఉన్నపరిస్థితల్లో టీవీ రంగం కూడా సినిమా రంగం తో పాటు పోటాపోటీగా వీక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. గత 5 సంవత్సరాల క్రితం టీవీ యాంకర్‌స్ అంటే సుమ మరియు జాన్సీ మధ్య బాగా పోటీ ఉండేది ఆ పోటీ వాళ్ళు మాట్లాడే మాటలకు మాత్రమే పరిమితమయ్యేదే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివెర్స్. ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే ఎవరు ఎక్కువ ఎక్సపోసింగ్ చేస్తే వాళ్ళ కెరీర్ పీక్స్ లో సాగుతుంది అన్న ముద్ర యాంకర్‌స్ లో బాగా నాటుకు పోయింది. ఈ కోవెకే చెందిన హాట్ అండ్ డైనమిక్ యాంకర్లు అనసూయ, రష్మిలతోపాటే బుల్లితెర మీద సూపర్‌ పాపులర్‌ అయిన యాంకర్‌ శ్రీముఖి.

శ్రీముఖి గురించి పక్కన పెడితే అనుసూ,య రష్మిల సంగతి చెప్పుకుంటే ఇద్దరికి ఇద్దరు ఎక్సపోజింగ్ చేస్తూ టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేస్తున్నారు. కానీ శ్రీముఖి ఆ కోవలో బాగా వెనకపడి ఉందేమో అనుకోవాలి పాపం. ఎందుకంటే తాజా గా ఈ అమ్మడికి మెగా హీరో పక్కన ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందట. ఆ హీరో ఎవరో కాదు వరుణ్ తేజ్, ప్రస్తుతం ఫైనల్ స్టేజి లో వున్న శ్రీను వైట్ల సినిమా మిస్టర్ ఐటెం సాంగ్ కి శ్రీముఖి తో చేద్దాం అనుకున్నారంట, ఉన్నట్టుండి ఏమైందో కానీ శ్రీను వైట్ల నువ్వు వరుణ్ తేజ్ పక్కన హైట్ తక్కువ గా చిన్న పిల్లలా ఉంటావ్ వద్దు అన్నాడట.

పాపం రాక రాక మెగా హీరో పక్కన ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చి హైట్ తక్కువుందన్న కారణం చేత పక్కన పెట్టేసారు అని తెగ ఫీల్ అయిపోతుందట ఈ భామ. ఆమె స్థానంలో ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరా..’ పాటలో నర్తించిన భామను తీసుకున్నట్టు సమాచారం.