ఇండస్ట్రీ కి సవాల్ విసురుతున్న ఛాందినీ చౌదరీ!!

 తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఆదరణ తక్కువే అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘కుందనపు బొమ్మ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఛాందినీ చౌదరీ సెన్సేషనల్‌ వ్యాఖ్యలు చేస్తోంది. రావడం రావడంతోనే ఈ ముద్దుగుమ్మ చాలా కాన్పిడెంట్‌గా మాటలు తూటాల్లా పేలుస్తోంది. అన్ని రకాల టాలెంట్‌ ఉన్న తెలుగమ్మాయిల్ని ఆదరించి చూడండి ఇండస్ట్రీ ఏ రకంగా దశ తిరుగుతుందో అంటూ సవాల్‌ చేస్తోంది. రాఘవేంద్రరావు సమర్పణలో ముళ్లపూడి వరా దర్శకత్వంలో రూపొందిన ‘కుందనపు బొమ్మ’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాసేపట్లో ఈ సినిమా రిజల్ట్‌ తెలియనుంది.

ట్రైలర్స్‌, టీజర్స్‌ అమ్మడి యాక్షన్‌ చాలా సూపర్బ్‌గా ఉన్నాయ్‌. పేరుకు తగ్గట్టుగానే కుందనపు బొమ్మలా ఉంది ముద్దుగుమ్మ చాందిని. నటిగా మంచి పేరు తెచ్చుకునేలానే ఉంది. ఏమిటో మరి ఈ అమ్మడి కాన్ఫిడెన్స్‌ కేవలం హీరోయిన్‌ పాత్రల్లో మాత్రమే నటిస్తాను. ఇంకే ఇతర పాత్రల్లో నటించనని ఖచ్చితంగా చెబుతోంది. ఏది ఏమైనా ఈ అమ్మడి గట్స్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పి తీరాల్సిందే. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేం సుధీర్‌, సుధాకర్‌ కొమ్మాకుల ఈ సినిమాలో హీరోలుగా నటించారు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఛాందిని లుక్‌ అదుర్స్‌. ఈ అమ్మడి కామెంట్స్‌తో తెలుగు ఇండస్ట్రీలో ఎంత మేర నిలదొక్కుకోగలదో చూడాలి. ఎంతైనా తెలుగమ్మాయి కదా ఈ ముద్దుగుమ్మని అందరూ ఆదరించాలనీ, సక్సెస్‌ అందుకోవాలని ఆశిద్దాం.