హృతిక్ తో “ఇప్పటికి నమ్మలేకపోతున్నా” : పూజ

మోడల్‌ రంగం నుండి వచ్చి, మిస్‌ ఇండియాగా నిలిచిన ముద్దుగుమ్మ పూజా హెగ్దే. తెలుగులో ‘ముకుంద’ సినిమాలో నేచురల్‌ బ్యూటీతో ఆకట్టుకుంది. అందం, అభినయం, కష్టపడే తత్వానికి పూజా పెట్టింది పేరు. అందుకే ఆమెను అనుకోని విధంగా ఆఫర్లు వరిస్తున్నాయి. తెలుగులో ‘ముకుంద’ తర్వాత నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. కానీ బాలీవుడ్‌లో ఈమెకు తొలి ఛాన్స్‌గానే అద్భుతమైన ఆఫర& దక్కడం ఆశ్చర్యకరమైన విషయమే.

బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హృతిక్‌ రోషన్‌ పక్కన హీరోయిన్‌గా నటించానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని మురిసిపోతోంది పూజా. హృతిక్‌ రోషన్‌, పూజా హెగ్దే జంటగా తెరకెక్కిన చిత్రం ‘మొహంజోదారో’. మొహంజోదారో గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదివినపుడే ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉండేది. అలాంటిది ఆటువంటి స్టోరీకి తాను ప్రధాన పాత్ర కావడం నిజంగా చాలా గొప్ప విషయం.

ఎంతమందో గొప్ప హీరోయిన్లను వరించని అదృష్టం తనకి దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నానంటోంది ముద్దుగుమ్మ పూజా హెగ్దే. అశుతోష్‌ గోవికర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పూజా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాల అభిప్రాయం. మరోవైపు టాలీవుడ్‌లో అల్లు అర్జున సినిమాలో పూజా నటించనుందని తాజా సమాచారం.