ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో కూడా అడ్డంకులు తొలగిపోయాయి. పరిపాలనను గాలికొదిలేసి గత నెల రోజులుగా పుష్కరాల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిన ప్రభుత్వం పాపం అదయ్యాక ఏమి చెయ్యాలో పాలుపోక ఎన్టీఆర్ జనతా గారేజ్ కి ఎలాంటి అడ్డంకులు సృష్టించవచ్చో అని ప్లాన్ చేసింది.

స్టార్ హీరోలనగానే బెనిఫిట్ షో లు ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ.దాంట్లో భాగంగానే జనతా గ్యారేజ్ సినిమాకు కూడా కృష్ణా జిల్లాలో బెనిఫిట్ షోలకి అభిమానులు ప్లాన్ చేసుకున్నారు. బయర్స్ రైట్స్ కూడా కొనేసుకున్నాక అధికారులు తాపీగా అనుమతి లేదంటూ అడ్డుపడ్డారు. అభిమానులు అయితే మంత్రులు దేవినేని ,ప్రత్తిపాటిలను కలిసినా పైనుండి ఒత్తిడి ఉండడం తో వారు మౌనమే వహించారు.

అయితే అభిమానులు కలెక్టరేట్ ఎదుట ధర్నాలకు పిలుపునివ్వడం తో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.ఈ మొత్తం వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారక ముందే అనుమతినిస్తే మంచిదన్న అభిప్రాయానికి ప్రభుత్వం పెద్దలు వచ్చారు.వారి ఆదేశాల మేరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా బెనిఫిట్ షో లు వేసుకోవచ్చంటూ అధికారులు ప్రకటించడం తో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండాపోయాయి.మొత్తానికి తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఆర్ద్రాత్రి దాటినా తరువాత నుండే జనతా గారేజ్ బెనిఫిట్ షో లు ఊపేయనున్నాయి.తెల్లవారే సరికి సినిమా రేంజ్ ఏంటో తెలిసిపోనుంది.