కిట్టు ఉన్నాడు జాగ్రత్త TJ రివ్యూ

చిత్రం పేరు: కిట్టు ఉన్నాడు జాగ్రత్త

పంచ్ లైన్:   ఈ కిట్టుగాడు హిట్ కొట్టాడు .

నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

నటీనటులు: రాజ్‌తరుణ్‌.. అను ఇమ్మాన్యుయేల్‌.. అర్ఫాజ్‌ఖాన్‌.. పృథ్వీ.. నాగబాబు.. రఘుబాబు.. రాజా రవీంద్ర.. తాగుబోతు రమేష్‌.. ప్రవీణ్‌.. సుదర్శన్‌ తదితరులు

మాటలు: బుర్రా సాయిమాధవ్‌

కథ:         శ్రీకాంత్‌ విస్సా

ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్‌

ఎడిటింగ్‌:     ఎంఆర్‌ వర్మ

సంగీతం:      అనూప్‌ రూబెన్స్‌

నిర్మాత: సుంకర రామబ్రహ్మం

దర్శకత్వం: వంశీకృష్ణ

యంగ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా ఏ టీవీ సమర్పణలో దొంగాట ఫేమ్ వంశి కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన చిత్రం కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త . ఉయ్యాలా జంపాల , కుమారి 21F , ఈదోరకం ఆదోరకం వంటి వరస హిట్స్ తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమా కావడం, మజ్ను ఫేమ్ అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించడం , అలాగే టైటిల్ లోని కొత్తదనం చూపించడంతో అసలు ఈ సినిమాలో ఏముందని సగటు ప్రేక్షకుడికి ఆతృత మొదలైంది. నేడే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం .

కథ:

సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ఇందులో డాన్ క్యారెక్టర్ లో కనిపించాడు , హీరో ధనవంతుల ఇళ్లలో కుక్కలను కిడ్నప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తుంటాడు , మరోపక్క హీరోయిన్ జానకిని ఇంప్రెస్స్ చెయ్యడనికి ట్రై చేస్తుంటాడు . ఈ క్రమం లో వచ్చే కామెడీ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. తర్వాత హీరోయిన్ మనోడి ప్రేమలో పడిపోవడం , ఇంతలోనే కిడ్నప్ విషయం తెలుసుకొన్న హీరోయిన్ కిట్టుగాడికి  దూరమవటం జరుగుతాయి , ఇంతలో కధలో ట్విస్టు గా  బాక్స్ ఒకటి బయట పడుతుంది ,బాక్స్ విషయం తెలుసుకొనే లోపే ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది .

ఫస్ట్ హాఫ్ అంత కామెడీ , ఇంకా పాటలతో నడుస్తుంది , ఇంతకు ఆ బాక్స్ లో ఏముంది , డాన్ అర్బాజ్ ఖాన్ ఆ బాక్స్ కోసం ఎందుకు వెతుకుతూంటాడు, అసలు ఆ బాక్స్ కి మనోడికి  సంబంధం ఏంటి అనేదే సెకండ్ హాఫ్ లో చూపించాడు దర్శకుడు వంశి కృష్ణ ,

విశ్లేష‌ణ:

ఓవర్ అల్ గ సినిమా అంత బాక్స్ చుట్ట్టు తిరుగుతుంటుంది . దాని మధ్యలో వచ్చే కమెడీ సన్నివేశాలు బావున్నాయి . కథ పరంగా కొత్తగానే వున్నాకధనం కొంచెం ఊహించతగినదిగా వుంది . ఐన చిన్న చిన్న ట్విస్టులతో , కామెడీ తో దాన్ని కవర్ చేసాడు డైరెక్టర్ .ఓరల్ గా రాజ్ తరుణ్ ఎన‌ర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు. హీరో హీరోయిన్ల యాక్షన్ , వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బావుంది,వెన్నెల కిశోరె రఘు బాబు  మధ్య కామెడీ సీన్స్ బావున్నాయి , ౩౦ ఇయర్స్ పృథ్వి హిలేరియస్గ చేసాడు , క్లైమాక్స్ లో పృథ్వి కి ఫిష్ వెంకట్ మధ్య వచ్చే సీన్ అద్భుతంగా వుంది  .ప్రతి నాయకుడుగా అర్బాజ్ ఖాన్ నటన అదుర్స్ , సాంగ్స్ అన్ని బనే వున్నాయి , ఒక హంస నందిని ఐటెం సాంగ్ తప్ప . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది , ఫస్ట్ హాఫ్ బావుంది,సెకండ్ హాఫ్ కొంచం బెటర్ గా    ఉండాల్సింది .

రేటింగ్: 3.25 / 5