గ్యారేజ్ కి చంద్రబాబు సెంటిమెంట్!

మాములుగా సగటు మనిషికి సెంటిమెంటు 100 కి 50 పాళ్ళుంటే అదే సినిమా వాళ్ళకి మాత్రం 100 కి 100 పాళ్ళు సెంటిమెంట్ ని నమ్ముతారు.అంత బలంగా సెంటిమెంట్ ఆంటే వాళ్ళకో సెంటిమెంట్ మరి.అది సినిమా పేరైనా..విడుదల తేదీ అయినా.వారమైనా.పేరులోని అక్షరాలయినా..వాటి అంకె అయినా సెంటిమెంట్ ఆంటే సెంటిమెంట్.అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు సినిమా వాళ్ళు.

ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ కెరీలోనే అత్యంత విపరీతమైన అంచనాలతో రాబోతోన్న కొరటాల శివ దర్శకత్వం వహించిన జనతా గ్యారేజ్ సీనియాకీ ఓ ఆసక్తికర సెంటిమెంట్ గురించి అందరు చర్చించుకుంటున్నారు.ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమా రాజమౌళి దర్శకత్వం లో 2003 లో వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమా విడులయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే వున్నారు..ఆ సినిమా విడుదలప్పుడే గోదావరి పుష్కారాలొచ్చాయి.సరిగ్గా మళ్ళీ 12 ఏళ్లకు ఎన్టీఆర్ నటించిన సినిమా ఒకటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా మళ్ళీ పుష్కారాలు టైం లోనే జనతా గ్యారేజ్ విడుదలవుతుండడం సెంటిమెంట్ గా ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.కాకపోతే సింహాద్రి టైం లో గోదావరి పుష్కరాలు ఇప్పుడు కృష్ణ పుష్కరాలు అంతే తేడా..